న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుండెపోటు కాదు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ క్రికెటర్

Real Reason Behind The Demise Of Former Cricketer VB Chandrasekhar || Oneindia Telugu
EX Crickter VB Chandrasekhar committed suicide due to financial strain, say police

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్‌ గుండెపోటుతో మృతి చెందలేని ఆయన గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని పోలీసులు వెల్లడించారు. చెన్నైలోని మైలాపూర్‌లో ఆయన స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారని తెలిపారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌

ఆయన మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపించామని... ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో వీబీ కంచి వీరన్స్‌ జట్టుకు వీబీ చంద్రశేఖర్‌ యజమానిగా ఉన్నారు. ఈ జట్టుపై ఆయు మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని పోలీసులు తెలిపారు.

ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే

ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే

ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆ జట్టు సరిగ్గా ఆడటం లేదని... దీంతో ఆయనకు ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు. గత నెలలో బ్యాంక్ నుంచి ఆయన నోటీసులు సైతం అందుకున్నారని తెలిపారు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగిన అనంతరం ఆయన తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు.

భార్య ఫిర్యాదు మేరకు

భార్య ఫిర్యాదు మేరకు

ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఆయన వయసు 58 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. తమిళనాడుకు చెందిన ఈ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ భారత్‌ తరఫున 1988-90 మధ్య కాలంలో ఏడు వన్డేలు ఆడి మొత్తం 88 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మతో కలిసి బుమ్రా, కోహ్లీని ఇమిటేట్ చేసిన జడేజా(వీడియో)

56 బంతుల్లో సెంచరీ

56 బంతుల్లో సెంచరీ

దీంతో చోటు కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన వీబీ చంద్రశేఖర్‌ 81 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. చంద్రశేఖర్‌ 1988-89 రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన ఇరానీకప్‌ మ్యాచ్‌లో చంద్రశేఖర్‌ 56 బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం. అప్పట్లో భారత్‌ తరఫున అదే ఫాస్టెస్ట్‌ ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ.

2012లో తమిళనాడు కోచ్‌గా

2012లో తమిళనాడు కోచ్‌గా

రిటైర్మెంట్‌ అనంతరం 2012లో తమిళనాడు కోచ్‌గా, గ్రెగ్‌ ఛాపెల్‌ భారత జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో సెలక్టర్‌గా సేవలు అందించాడు. చంద్రశేఖర్‌ మృతిపట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది. మాజీ క్రికెటర్లు అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో పాటు హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనాలు సైతం సానుభూతి తెలిపారు.

Story first published: Friday, August 16, 2019, 15:57 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X