న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికే పట్టం కట్టిన బీసీసీఐ

It's official, Ravi Shastri Stays On As India Head Coach || Oneindia Telugu
 Ravi Shastri again! BCCI CAC reappoint former India captain as head coach

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి నియామకం అయ్యారు. 2017 నుంచి జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న శాస్త్రి మరో రెండేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు రవిశాస్త్రి నియామకాన్ని ధ్రువీకరిస్తూ క్రికెట్ సలహా కమిటీకి నేతృత్వం వహించిన కపిల్‌దేవ్‌ అధికారిక ప్రకటన విడుదల చేశాడు.

ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపైన, ఇతర అన్ని అంశాలపై రవిశాస్త్రికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో తదుపరి కోచ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఐదుగురు సభ్యులనే ఇంటర్వ్యూ చేసిన క్రికెట్‌ సలహా కమిటీ

ఐదుగురు సభ్యులనే ఇంటర్వ్యూ చేసిన క్రికెట్‌ సలహా కమిటీ

ఈ క్రమంలో ఇంటర్వ్యూలు మొదలైన కొద్దిసేపటికే కోచ్‌ రేసు నుంచి ఫిల్‌ సిమ్మన్స్‌ తప్పుకున్నాడు. అయితే, వ్యక్తిగత కారణాలతో ఫిల్‌ సిమ్మన్స్‌ ఇంటర్వ్యూకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిసింది. దీంతో కోచ్‌ రేసులో షార్ట్ లిస్ట్ అయిన మిగతా ఐదుగురు సభ్యులను క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూ చేసింది. దీంతో ఐదుగురిలో కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది.

కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగిస్తూ నిర్ణయం

కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగిస్తూ నిర్ణయం

కోచ్‌గా అతడినే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌ కోహ్లీ బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కమిటీ సభ్యుడైన అన్షుమన్‌ గైక్వాడ్‌ సైతం అతడి పట్ల సానుకూలత వ్యక్తం చేశాడు. దీంతో అందరూ ఊహించినట్లే రవిశాస్త్రే మళ్లీ కోచ్‌ పదవి దక్కించుకున్నాడు. అందుకు కారణంగా కోచ్‌గా రవిశాస్త్రి ట్రాక్ రికార్డే.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకున్న టీమిండియా

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకున్న టీమిండియా

రవి శాస్త్రి కోచింగ్‌లోనే టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. భారత జట్టులోని ఆటగాళ్లందరితో రవిశాస్త్రికి మంచి సంబంధాలు ఉండటం కలిసొచ్చింది. రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి (జులై 2017) భారత్‌ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది.

రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న శాస్త్రి

రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న శాస్త్రి

కొత్త కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. భారతదేశం ఆతిథ్యమిస్తోన్న 2021 టీ20 ప్రపంచకప్‌ వరకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగనున్నాడు. రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్, రాబిన్‌ సింగ్, ఫిల్‌ సిమన్స్‌ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.

Story first published: Friday, August 16, 2019, 19:10 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X