న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ స్థానానికి రాహులే సరైనోడు: మాజీ వికెట్ కీపర్

 Deep Dasgupta backs Rahul to keep wickets in T20Is

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా యువ ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌‌కే ఉందని మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా అన్నాడు. అన్ని ఫా‌ర్మాట్లలో కీపర్‌గా రాహుల్‌ సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ కిదా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న తరుణంలో అతని వారసత్వాన్ని అందుపుచ్చుకోవడానికి రాహులే సరైనోడని తెలిపాడు.

పంత్‌ను పక్కన పెట్టాలి..

పంత్‌ను పక్కన పెట్టాలి..

‘టీ20ల్లో రాహులే కీపింగ్ చేయాలని కోరుకుంటున్నా. అతనికి బ్యాటింగ్, కీపింగ్ ఎలా చేయాలో బాగా అర్థమైంది. రాహుల్ సరైన వికెట్ కీపర్. సాంకేతిక నైపుణ్యం ఉన్నవాడు. లాంగ్‌టర్మ్ కోసం రిషభ్‌పంత్‌ను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతనికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. పంత్ పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ డొమెస్టిక్ క్రికెట్‌ ఆడించాలి. అప్పటికి సామర్థ్యం నిరూపించుకోకపోతే.. అతనికే సిగ్గు చేటు'అని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు.

అవకాశాలు రాలేదు..

అవకాశాలు రాలేదు..

ఇక రాహుల్ కీపర్‌గా దేశవాళీ క్రికెట్‌లో రాణించాడని, అతని స్టేట్ టీమ్ కర్ణాటక తరఫున, ఐపీఎల్‌లో ఆర్సీబీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున కీపింగ్ చేశాడని దీప్ దాస్ గుప్తా గుర్తు చేశాడు. జూనియర్ క్రికెట్‌లో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న రాహుల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అంతగా అవకాశాలు దక్కలేదన్నాడు. వికెట్ల వెనుకాల పంత్ స్థానాన్ని రాహుల్ ఓ సారి భర్తీ చేస్తే.. అతను మరో అవకాశం ఇవ్వడని, తన సత్తాచాటుతాడని ఈ మాజీ వికెట్ కీపర్ అన్నాడు.

40 ఏళ్ల వయసులో కూడా..

40 ఏళ్ల వయసులో కూడా..

మరోవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన 40 ఏళ్ల వయసులోనూ మెరుగ్గా క్రికెట్‌ ఆడగలడని దీప్ దాస్ ధీమా వ్యక్తం చేశాడు. అటు ఫిట్‌నెస్‌ పరంగానే కాకుండా మానసికంగా కూడా విరాట్ మెరుగ్గా ఉండటమే అందుకు కారణమన్నాడు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరంగా కోహ్లి ఇప్పుడు తిరుగులేని స్థితిలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు.

‘ప్రస్తుతం అతని వయసు 31ఏళ్లే కాబట్టి ఇంకా ఆరు సంవత్సరాలు అలవోకగా క్రికెట్‌ ఆడేస్తాడు. నా అంచనా ప్రకారం కోహ్లీలో మరో పదేళ్ల క్రికెట్‌ ఆడే సామర్థ్యం ఉంది. శారీరకంగా ఎంత ఫిట్‌గా ఉన్నాడో.. మానసికంగా అంతే ధృఢంగా ఉన్నాడు' అని దీప్‌దాప్‌ గుప్తా తెలిపాడు.

70 సెంచరీలు..

70 సెంచరీలు..

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. 2012 నుంచి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే పూర్తిగా శాఖాహారిగా మారిపోయిన విరాట్.. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ప్రాధాన‍్యత ఇస్తున్నాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో 27 శతకాలు సాధించిన కోహ్లీ.. వన్డేల్లో 43 సెంచరీలు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు పూర్తి చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ సెంచరీల జాబితాలో కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ సచిన్‌ టెండూల్కర్‌(100) తొలి స్థానంలో ఉండగా, రికీ పాంటింగ్‌(71) రెండో స్థానంలో ఉన్నాడు.

కరోనా ఎఫెక్ట్: భారత స్టార్ ప్లేయర్లు కాస్త రైతు కూలీలుగా..

Story first published: Monday, May 4, 2020, 13:52 [IST]
Other articles published on May 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X