
కొడవలితో రాణి మాలిక్..
మైదానంలో హాకీ స్టిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టేందుకు పరుగెత్తే భారత మహిళా హాకీ ప్లేయర్ పూనమ్ రాణి మాలిక్(28).. కరోనా పుణ్యమా కొడవలి చేత బట్టి పంటను కోస్తుంది. పంట కోయడానికి హార్వెస్టర్ నియమించుకున్నా.. వర్షం కారణంగా పొలం బురదగా మారడంతో వారి రెండు ఎకరాల పొలంలో పంటను కోయడం సగం మాత్రమే యంత్రంతో సాధ్యమైంది. హర్వెస్టర్ వదిలేసిన పంటను రాణి.. కుటుంబ సభ్యులతో కలిసి కోస్తోంది. నాలుగు రోజుల్లో కొడవలిని ఎలా ఉపయోగించాలో బాగా నేర్చుకున్నానని రాణి మాలిక్ తెలిపింది. రాణి మాలిక్ భారత్ తరఫున 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. రియో ఒలింపిక్స్‌లో ఫార్వార్డ్ ప్లేయర్‌గా కూడా వ్యవహరించింది.

పంట కోస్తున్న బాక్సర్ మనోజ్ కుమార్..
రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు కురిపించే బాక్సర్ మనోజ్ కుమార్.. ప్రస్తుతం పొలంలో కొడవలితో చేతికొచ్చిన పంటను కోస్తున్నాడు. 1999లో జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత తను పొలంలో అడుగుపెట్టడం ఇది రెండోసారి మాత్రమేనని తెలిపాడు. ‘చిన్నతనం నుంచి పెద్దవాళ్లు కోతలు కోయడం చూస్తూనే ఉన్నా.అప్పుడు మా నాన్నకు తోడుగా ఉండాలని సరదాగా హార్వెస్టింగ్ చేసేవాడిని. కానీ ఈసారి నిజంగానే నేను పంటను కోస్తున్నా' అని మనోజ్ కుమార్ నవ్వుతూ తెలిపాడు. ఇక మనోజ్ కుడార్ 2019 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచి భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న తొలి పురుష బాక్సర్‌గా గుర్తింపు పొందాడు.

బస్తాలు నింపుతున్న అమిత్ పంగల్..
ప్రపంచ నెంబర్ వన్ ప్లెయివేట్ బాక్సర్ అమిత్ పంగల్ బస్తాలు నింపుతూ తన కుటుంబానికి సాయంగా నిలుస్తున్నాడు. ‘సాధారణంగా ఈ పంట కోతల సమయంలో బాక్సింగ్ కమిట్ మెంట్స్ వల్ల నేను ఔట్ ఆఫ్ స్టేషన్లలో ఉంటా. కానీ ఈసారి లాక్‌డౌన్ కారణంగా మా ఊరిలోనే ఉండటంతో నా కుటుంబానికి సాయం చేసే అవకాశం లభించింది. గోధుమ పంట కోయడం, ఆ ధాన్యాన్ని ప్యాకింగ్ చేసే విషయంలో సాయం చేస్తున్నా. రైతు కొడుకుననే విషయం అన్నిటికన్నా నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది'అని పంగల్ చెప్పుకొచ్చాడు.

బ్రాంజ్ మెడలిస్ట్ రింకూ హుడా..
భారత యువ పారా అథ్లెట్ రింకు హుడా(20) బకెట్ సాయంతో ధాన్యాన్ని బస్తాల్లో నింపుతూ.. తన కుటుంబానికి పొలం పనుల్లో చేదోడుగా ఉంటున్నాడు. 2018లో పారా ఏషియన్ గేమ్స్ లో జావెలిన్ లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ‘హార్వెస్టింగ్ మిషన్‌తో కలిసి చేయడమే నాపని. ఇప్పటికే మా పొలంలోని సగం పంటను కొసేశాం. కోత అయిపోయాక ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపేందకు సాయపడుతున్నా. బకెట్ సాయంతో ధాన్యాన్ని సంచుల్లో నింపుతా. మా గ్రామంలో వ్యవసాయ కూలీలు దొరకడం చాలా కష్టం.'అని రింకూ తెలిపాడు.


Click it and Unblock the Notifications
