న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గేల్.. నువ్వే నా క్వారంటైన్‌ పార్ట్‌నర్.. రమ్ తీసుకురావడం మర్చిపోకు: మహిళా క్రికెటర్

Danielle Wyatt to her quarantine partner Chris Gayle

హైదరాబాద్: కరోనా కల్లోలతంతో యావత్ ప్రపంచం నిర్భంధంలోకి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా టోర్నీలు రద్దయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో క్రికెటర్లంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో ఆస్వాదిస్తున్నారు.

ఐసీసీ ఫన్నీ ట్వీట్..

ఐసీసీ ఫన్నీ ట్వీట్..

ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెటర్లని ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ.. కొంత మంది క్రికెటర్ల ఫొటోలతో GIF ఫైల్‌‌ను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. దీనికి ‘క్వారంటైన్‌‌లో ఉంటే మీ భాగస్వామి ఎవరు ఉండాలనుకుంటున్నారో.. స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేయండి'అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది.

కోహ్లీని కోరుకున్న గిబ్స్

కోహ్లీని కోరుకున్న గిబ్స్

ఈ ట్వీట్‌కి ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు తమదైన శైలిలో బదులిచ్చాు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్చెల్లె గిబ్స్ తన పార్టనర్‌గా విరాట్ కోహ్లీ ఉండాలనుకున్నట్లు వెల్లడించాడు. ‘క్వారంటైన్‌లో కోహ్లీతో కలిసి జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేయాలనుకుంటున్నా'అని గిబ్స్ ఐసీసీ ట్వీట్‌కు బదులిచ్చాడు. ఇక ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఐపీఎల్ సహచరుడు కేన్ విలియమ్సన్‌ను కావాలనుకున్నాడు. ఇలా ఆయా క్రికెటర్లు తమకు నచ్చిన భాగస్వాములను ఎంచుకున్నారు.

బయటికి వెళ్తే మన్కడింగ్ ఔటే.. తస్మాత్ జాగ్రత్త: అశ్విన్

గేల్ టాయిలెట్ క్లీన్ చేయాలి..

గేల్ టాయిలెట్ క్లీన్ చేయాలి..

అయితే.. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వాట్ స్పందించిన తీరు మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌‌ను తన క్వారంటైన్‌ పార్ట్‌నర్‌గా ఎంచుకున్న డేనియల్.. ‘క్రిస్‌గేల్ టాయిలెట్ రోల్, కొంత రమ్ తీసుకురావడం మరిచిపోకు''అని బదులిచ్చింది. తనతో క్వారంటైన్‌లో ఉంటే టాయిలెట్స్ గేల్ శుభ్రం చేయాలనే తన ఉద్దేశాన్ని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో..

ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో..

విదేశాల నుంచి స్వదేశాలకు వెళ్లిన క్రికెటర్లు అక్కడి ప్రభుత్వాల ఆదేశాల మేరకు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. కరోనా వైరస్ కట్టడికి అన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు, ఆస్ట్రేలియా టూర్ నుంచి స్వస్థలాలకు వెళ్లిన న్యూజిలాండ్ క్రికెటర్లు ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అలానే యూరప్ దేశాల నుంచి వెళ్లిన శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించాడు.

Story first published: Wednesday, March 25, 2020, 17:17 [IST]
Other articles published on Mar 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X