న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బయటికి వెళ్తే మన్కడింగ్ ఔటే.. తస్మాత్ జాగ్రత్త: అశ్విన్

Ravichandran Ashwin uses Mankad law to warn people about Covid-19 threat
Ravichandran Ashwin Uses 'Mankad' Moment To Ask People to Stay Indoors

చెన్నై: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా కృషి చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ'ను విజయంవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అశ్విన్‌.. తన ట్విటర్‌ ఖాతా పేరును 'లెట్స్‌ స్టే ఇండోర్స్‌ ఇండియా'‌గా కూడా మార్చుకున్నాడు.

తొలి రోజు బుద్దిగా కర్ఫ్యూను పాటించిన ప్రజలు ఆ తర్వాత నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలకు ఇళ్లకే పరిమితం కావాలని లేకుంటే జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయో... సింపుల్‌గా సుత్తి లేకుండా చెబుతూ అశ్విన్ తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తున్నాడు.

భారత్‌లో పరిస్థితి చేయిదాటుతుండటంతో ప్రధాని మోదీ మంగళవారం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ తాజాగా చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఓ కోహ్లీ ఒక కోటి ఇవ్వరాదు.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు విరాళలు ప్రకటించరే?ఓ కోహ్లీ ఒక కోటి ఇవ్వరాదు.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు విరాళలు ప్రకటించరే?

ఇంతకీ అశ్విన్ ఏం చేశాడంటే..

ఇంతకీ అశ్విన్ ఏం చేశాడంటే..

క్రికెట్‌లోనే వివాదస్పద నిబంధన అయిన ‘మన్కడింగ్ ఔట్'‌తో ప్రస్తుత పరిస్థితి పోల్చుతూ ప్రజలను ఇంట్లోనే ఉండాలని హెచ్చరించాడు. ఇంట్లోనే ఉండండి లేకుంటే మన్కడింగ్ ఔట్ అవుతారని సూచించాడు. బంతి వేయకుండా క్రీజు దాటిన బ్యాట్స్‌మన్‌లా బయటకు వెళ్లి కరోనాను అంటించుకోవడం అవసరమా? అనే తన ఉద్దేశాన్ని ఈ ట్వీట్‌లో తెలియజేశాడు.

ఇప్పుడు గుర్తు చేయడం బాగుంది..

‘హహాహా.. ఎవరో ఈ ఫొటోను నాకు పంపి.. ఈ రనౌట్ జరిగి సరిగ్గా ఏడాది అయిందని గుర్తు చేశారు. దేశం లాక్‌‌డౌన్‌లో ఉన్నప్పుడు దీన్ని గుర్తు చేయడం బాగుంది. బయటకు రాకండి. ఔటవ్వకండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!'అంటూ మన్కడింగ్‌కు సంబంధించిన ఫొటోకు # 21DayLockdown యాష్ ట్యాగ్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

మన్కడింగ్ అంటేనే అశ్విన్..

మన్కడింగ్ అంటేనే అశ్విన్..

గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్ బ్యాట్స్‌మన్‌ జోస్ బట్లర్‌ను అప్పుడు పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్ ‘మన్కడింగ్‌' ద్వారా ఔట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద దుమారాన్నే రేపింది. క్రీడాస్పూర్తికి విరుద్దంగా అశ్విన్ వ్యవహరించాడని కొందరు విమర్శించగా.. అతను నిబంధనల ప్రకారమే వ్యవహరించాడని మరి కొందరు మద్దతు పలికారు. అప్పట్లో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో మన్కడింగ్ అనగానే అశ్విన్.. అశ్విన్ అనగానే మన్కడింగ్ అనే విషయం అభిమానులకు గుర్తుండిపోయింది.

అసలు మన్కడింగ్‌ అంటే..

అసలు మన్కడింగ్‌ అంటే..

క్రికెట్‌ నిబంధనలు రూపొందించే ఎంసీసీ ప్రకారం... బౌలర్‌ బంతిని వేయడానికి సిద్ధమై, అతని చేతినుంచి ఇంకా బంతి వెళ్లక ముందే నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ దాటి బయటకు వస్తే బెయిల్స్‌ను పడగొట్టి బౌలర్‌ సదరు బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కోసం అప్పీల్‌ చేయవచ్చు. ఇది సాంకేతికంగా రనౌట్‌ జాబితాలో వస్తుంది.

2017 అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బౌలర్‌ బంతిని విసిరే లోగా ఏ సమయంలోనైనా నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ బయట ఉంటే ఔట్‌గానే పరిగణిస్తారు. నిబంధల ప్రకారం అశ్విన్‌ చేసింది సరైందే.

క్రీడా స్ఫూర్తి ప్రకారం బ్యాట్స్‌మన్‌ను ఔటే చేసే ముందు ఒక సారి హెచ్చరిస్తే బాగుంటుందని అంటారు కానీ నిబంధనల్లో ఎక్కడా ముందుగా హెచ్చరించాలని లేదు. 1947లో సిడ్నీ టెస్టులో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ బ్రౌన్‌ను భారత ఆల్‌రౌండర్‌ వినూ మన్కడ్‌ ఇలా ఔట్‌ చేయడంతో ‘మన్కడింగ్‌' అని పేరు వచ్చింది.

Story first published: Wednesday, March 25, 2020, 14:42 [IST]
Other articles published on Mar 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X