న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు ఒత్తిడా.. యూనివర్స్ బాస్ ఇక్కడా.. గుండెపోటు తెప్పిస్తా: క్రిస్‌ గేల్

Chris Gayle Gives A Fitting Response When Being Asked Whether He Felt Nervous While Batting

దుబాయ్: ఐపీఎల్ 2020లో యూనివర్స్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఎట్టకేలకు బరిలోకి దిగాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశాన్ని తన మార్క్ పెర్ఫామెన్స్‌తో అందిపుచ్చుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గేల్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో జిగేల్‌మన్నాడు. తన పాత ప్రాంచైజీ బౌలర్లను చెడుగుడాడాడు. తన తొలి మ్యాచ్‌లోనే సూపర్ ఫిఫ్టీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గేల్ తన బ్యాట్‌పై ఉన్న 'బాస్'ను చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు.

 ఈ పేరుకు గౌరవం ఇవ్వండి..

ఈ పేరుకు గౌరవం ఇవ్వండి..

ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హోస్ట్ ప్రశ్నించగా ' అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను చూపించే ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి' అని సరదాగా చెప్పుకొచ్చాడు. అనంతరం చాలా రోజుల తర్వాత బ్యాటింగ్‌ చేయడంతో ఒత్తిడి అనిపించిందా? అని అడగ్గా అలాంటిదేమీ లేదని చెప్పాడు. తాను యూనివర్స్‌ బాస్‌ అని, తానెందుకు ఒత్తిడికి గరవుతానని ఎదురు ప్రశ్నించాడు.

గుండెపోటు తెప్పించగలను..

గుండెపోటు తెప్పించగలను..

'నేనేం ఒత్తిడికి గురవ్వలేదు. నేను యూనివర్స్‌ బాస్‌. అలా ఎలా అనుకుంటారు?నేను గుండెపోటు తెప్పించగలను. ఇటీవల క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే, ఇప్పుడు బాగా ఆడడంతో సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శనతో 2021 సీజన్‌కు కూడా సిద్ధంగా ఉండాలని భావిస్తున్నా. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పరుగులు చేయొచ్చని అనుకున్నా. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు ఇబ్బందే. దాన్ని మేం సద్వినియోగం చేసుకున్నాం.

 నా బాధ్యత నిర్వర్తించా..

నా బాధ్యత నిర్వర్తించా..

ఈ మ్యాచ్‌లో జట్టు యాజమాన్యం నన్ను ఆడించాలని అనుకుంది. నా పని నేను పూర్తిచేశా. ఇక ఈ సీజన్‌లో మా ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడుతున్నారు. అందుకే వాళ్లని అలాగే ఆడించాం. అయితే, ఈ విజయం మా జట్టుకు ఎంతో అవసరం. నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండడం ముఖ్యమని అనుకున్నా. రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితమవ్వడం ఇష్టం ఉండదు. కానీ ఆ స్థానాన్ని ఆస్వాదించా. అనారోగ్యానికి గురవ్వడం తప్పితే ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి సమస్యల్లేవు' అని గేల్‌ చెప్పుకొచ్చాడు.

 5 సిక్స్‌లతో..

5 సిక్స్‌లతో..

ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లీ (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్‌ (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కేఎల్ రాహుల్‌ (49 బంతుల్లో 61 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్‌ (45 బంతుల్లో 53; 1 ఫోర్‌ 5 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు.

ఈ గూగుల్‌కు ఏమైంది? కేఎల్ రాహుల్ సతీమణి ఆ బాలీవుడ్ హీరోయినంట!

Story first published: Friday, October 16, 2020, 20:32 [IST]
Other articles published on Oct 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X