ఈ గూగుల్‌కు ఏమైంది? కేఎల్ రాహుల్ సతీమణి ఆ బాలీవుడ్ హీరోయినంట!

హైదరాబాద్: ఏ సమాచారం కావాలన్నా అందరం గూగులమ్మనే ఆశ్రయిస్తాం. మనకు కావాల్సిన సమాచారాన్ని సెకండ్ల వ్యవధిలోనే ముందుంచ గల సత్తా ఈ సెర్చ్ ఇంజిన్‌కు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగించే ఈ గూగుల్ ఇప్పుడు గతి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. తప్పులు జరుగుతున్నాయని సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తున్నా కనీసం సవరించుకునే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు విస్మయానికి కలిగిస్తోంది. మొన్న విరాట్ కోహ్లీ భార్య అనూష్కశర్మను ఆప్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్యగా చూపించి నవ్వులపాలైన గూగుల్.. నిన్న యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ భార్య ఎవరని సెర్చ్ చేస్తే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ పేరును చూపించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
తాజాగా మళ్లీ అలాంటి తప్పుడు సమాచారాన్ని జనం ముందు ఉంచుతూ తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ భార్య కోసం సెర్చ్ చేస్తే బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి పేరును సూచిస్తుంది. దాంతో ఈ గూగుల్‌కు ఏమైంది.. ఈ తప్పుడు సమాచారం మళ్లీ మళ్లీ రావడం ఏందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

kl rahul wife అని సెర్చ్ చేస్తే..
kl rahul wife అని గూగుల్ సెర్చ్ చేస్తే.. వెంటనే బాలీవుడ్ హీరోయిన అతియా శెట్టి పేరు, ఫొటోలు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతున్నాయి. వారిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫొటోలు కనిపిస్తున్నాయి. అయితే రాహుల్, అతియా ఇద్దరికి పెళ్లి కాలేదు. వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనేది అటు బాలీవుడ్.. ఇటు క్రికెట్ వర్గాలు గత కొంతకాలంగా కోడై కూస్తున్నాయి. ఈ ఇద్దరు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించకున్నా బాహటంగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. బర్త్‌డే విషెస్‌లు చెప్పుకున్నారు. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలకు కామెంట్ చేసుకున్నారు. దాంతో వీళ్లద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకానీ వీళ్లు భార్య భర్తలు కాదు.

గాసిప్స్ కథనాలతో..
విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మను ఏకంగా అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్యగా చూపించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. Rashid Khan wife అని సెర్చ్ చేసిన వాళ్లకు దిమ్మతిరిగేలా రషీద్ ఖాన్, అనూష్క శర్మ ఫొటోలను చూపించింది. అలాగే శుభ్‌మన్ గిల్ భార్య ఎవరని సెర్చ్ చేస్తే ఇదే తరహాలో సచిన్ టెండూల్కర్ కూతురు పేరును సూచించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ అని చెప్పాడు. దాంతో రషీద్ ఖాన్‌కు ఇష్టమైన హీరోయిన అనుష్కా శర్మ అని చాలా వెబ్‌సైట్లు కథనాలు రాసాయి. ఆ ప్రభావంతోనే రషీద్ ఖాన్ వైఫ్ అని సెర్చ్ చేస్తే అనుష్క ఫొటోను చూపించింది.అలాగే శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొంత కాలంగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. దీంతో అనేక గాసిప్ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలతో గూగుల్ తల్లి పప్పులో కాలేసింది. ఇన్ని విమర్శలు వస్తున్నా గూగుల్ తన తప్పును సవరించుకోవడం గమనార్హం.

ఇప్పుడు కూడా అదే..
ఇక కేఎల్ రాహుల్, అతియా విషయంలో కూడా గూగుల్ అదే తప్పిదం చేసింది. వారి మధ్య వచ్చిన గాసిప్ కథనాల కారణంగానే తప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. ఈ తప్పుడు సమాచారంతో నెటిజన్లు గూగుల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. 'సతీమణులను మార్చేస్తుంది.. పెళ్లికాని వారికి పెళ్లి చేస్తూంది. గాసిప్ రాయుళ్లకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తుంది'అంటూ గూగుల్‌పై సోషల్ మీడియావేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

చెలరేగుతున్న కేఎల్ రాహుల్..
ఐపీఎల్ 2020లో కింగ్స్ పంజాబ్ జట్టును నడిపిస్తున్న కేఎల్ రాహుల్.. వ్యక్తిగతంగా రాణిస్తున్నా జట్టుకు విజయాలందించలేకపోతున్నాడు. ఆ జట్టు ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడి రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది. గెలిచే మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతుంది. ఇక వ్యక్తిగతంగా రాహుల్ దూసుకుపోతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 448 పరుగులతో టాప్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో రాణిస్తున్నా ఆ జట్టు విజయం ముంగిట తడబడుతుంది. గురువారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆఖరి బంతికి విజయాన్నందుకొని ఊపిరి పీల్చుకుంది.
పంజాబ్ చేతిలో ఆర్‌సీబీ ఓటమికి కోహ్లీ చెత్త కెప్టెన్సీనే కారణమా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications