న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవర్నో మెప్పించడం కాదు.. జట్టును గెలిపించడమే నా లక్ష్యం: పుజారా

Cheteshwar Pujara Says My aim is not to entertain someone

రాజ్‌కోట్: ఎవర్నో మెప్పించడం తన లక్ష్యం కాదని, భారత జట్టును గెలిపించడమే తన కర్తవ్యమని టెస్ట్ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా తెలిపాడు. టెస్టుల్లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని టీమిండియా నయావాల్‌గా పేరుగాంచిన ఈ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్.. ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు.

దీంతో సోషల్‌మీడియా వేదికగా అతని బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే విషయంపై ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడిన పుజారా తాను సోషల్‌ మీడియాలో విమర్శించే వారికోసం ఆడనని స్పష్టం చేశాడు. చాలా మందికి తన ఆట అర్థం కాదని, ఎందుకంటే వాళ్లంతా పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే చూస్తారన్నాడు.

అలరించడానికి బ్యాటింగ్ చేయను..

అలరించడానికి బ్యాటింగ్ చేయను..

‘మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవర్నో అలరించడం నా లక్ష్యం కాదు. జట్టును గెలిపించడమే నా గోల్. అది టీమిండియా కావొచ్చు లేదా సౌరాష్ట్ర అయినా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఆడతా, మరికొన్ని సార్లు నిదానంగా ఆడుతా. నేను క్రికెట్‌ ప్రేమికులను,ప్రేక్షకులను చాలా గౌరవిస్తా. నేనైతే సిక్సులు కొట్టే ఆటగాడిని కాదు. అలాగే సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటా. ఆడేటప్పుడు అసలు దాని జోలికే వెళ్లను. ఎవరినో మెప్పించడానికి నేను బ్యాటింగ్‌ చేయను' అని పుజారా తెలిపాడు.

ఇంగ్లండ్ క్రికెటర్‌కు కరోనా.. పీఎస్‌ఎల్ రద్దు!!

టెస్ట్ క్రికెట్ వీక్షకుల్లో మార్పు..

టెస్ట్ క్రికెట్ వీక్షకుల్లో మార్పు..

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టెస్టు క్రికెట్‌ చూసే విషయంలో మార్పు వచ్చిందని ఈ సౌరాష్ట్ర ప్లేయర్ తెలిపాడు. తాజాగా ముంబైలోని ఓ ప్రాంతంలో తాను డిన్నర్‌ చేస్తుండగా ఇద్దరు వృద్ధులు కలిశారని.. సునీల్ గావస్కర్‌, గుండప్ప విశ్వనాథ్‌ల తర్వాత తనకోసమే వాళ్లు టెస్టులు చూస్తున్నట్లు చెప్పారని వెల్లడించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడుతా..

పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడుతా..

తాను దూకుడుగా ఆడలేననేది సరికాదని పుజారా తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కూడా ఆడగలనన్నాడు. ' పరిమిత ఓవర్లలో నా ఆటను టీవీల్లో చాలా మంది చూడరు. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకుంటానన్న విషయం నాకూ తెలుసు. కానీ.. చిన్నప్పటి నుంచీ అలాగే ఆడుతూ పెరిగా' అని ఈ టెస్టు బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, పుజారా.. కివీస్‌ పర్యటన తర్వాత రంజీట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరే చేసినా.. ఆ జట్టు బెంగాల్‌పై గెలిచి విజేతగా నిలిచింది.

Story first published: Tuesday, March 17, 2020, 17:11 [IST]
Other articles published on Mar 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X