న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ క్రికెటర్‌కు కరోనా.. పీఎస్‌ఎల్ రద్దు!!

Alex Hales had symptoms of Coronavirus and Pakistan Super League (PSL) has been called off

కరాచీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కొవిడ్-19).. క్రీడా రంగాన్ని అయితే అతలాకుతలం చేసింది. ఇప్పటికే ఎన్నో సిరీస్‌లు.. మరెన్నో టోర్నీలు రద్దయ్యాయి.. వాయిదా పడ్డాయి. దీని దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ కూడా ఎప్రిల్ 15కు పోస్ట్‌పోన్ అయింది. అసలు జరుగుతుందో లేదోనన్న సందిగ్ధత కూడా నెలకొంది.

ప్రపంచ వ్యాప్తంగా టోర్నీలన్నీ రద్దు అవుతున్నా.. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ మాత్రం కొనసాగింది. అప్పటికే ఆ టోర్నీ తుది దశకు చేరడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రేక్షకుల్లేకుండా తూతూ మంత్రంగా నిర్వహించాలనుకుంది. కానీ తాజాగా ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్‌కు కరోనా లక్షణాలు బయటపడటంతో నేడు (మంగళవారం) జరగాల్సిన సెమీఫైనల్, బుధవారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.

ముందే జట్టు వీడినా..

కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన అలెక్స్ హేల్స్.. కరోనా నేపథ్యంలో ముందే జట్టు వీడినా అతను కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమిజ్ రాజా తెలిపారు. దీంతో పీఎస్‌ఎల్ బ్రాడ్‌‌కాస్టర్స్, కామెంటేటర్స్ అందరూ కరోనా టెస్ట్‌లు చేయించుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలను కూడా అతను ధృవీకరించారు.

‘ఇదో దురదృష్టకర సందర్భం. చివరికైతే మంచి నిర్ణయమే తీసుకున్నారు. పీఎస్‌ఎల్‌ను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలెక్స్ హేల్స్‌ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. అతనికి వెంటనే పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ రావాల్సి ఉంది. బ్రాడ్‌కాస్టర్స్, కామెంటేటర్స్‌ము కూడా రాబోయే రెండు గంటల్లో కరోనా టెస్ట్‌లు చేయించుకోనున్నాం.'అని న్యూస్ 99 అనే చానెల్‌కు రమిజ్ రాజా తెలిపారు.

ప్లేయర్ ఐడెంటిని దాచిపెట్టిన పీసీబీ

ఇక పీఎస్‌ఎల్ వాయిదా వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ధృవీకరించింది. ఇటీవల పాకిస్థాన్ వీడిన ఓ క్రికెటర్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపింది. అతని పేరు చెప్పుకుండా పరీక్షలకు పంపినట్లు పేర్కొంది. పీసీబీ సీఈవో వసీం ఖాన్ సైతం ప్లేయర్ ఐడెంటినీ దాచిపెట్టాడు. ‘ పీఎస్ఎల్ ఆడిన ఓ ప్లేయర్ కరోనా లక్షణాలతో బాధపడటం వాస్తవం. అతనెవరో చెప్పలేం. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం'అని తెలిపాడు.

కేవలం ఓవర్‌సిస్ ప్లేయర్ అనే చెప్పాం..

కేవలం ఓవర్‌సిస్ ప్లేయర్ అనే చెప్పాం..

రమిజ్ రాజా చెప్పిన అంశాన్ని ప్రస్తావించగా..‘అయినా తాము ఆ ప్లేయర్ ఎవరో చెప్పలేం. మేం కేవలం ఓవర్‌సిస్ ప్లేయర్ అని మాత్రమే చెప్పాం. ప్రస్తుతం అతను పాక్‌లో లేడు. గడిచిన 24 గంటల్లోనే అతను కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు.'అని వసీం ఖాన్ తెలిపాడు.

Story first published: Tuesday, March 17, 2020, 16:00 [IST]
Other articles published on Mar 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X