న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ టెస్ట్ క్రికెటే అసలైన ఆట: పుజారా

Cheteshwar Pujara Says I am a diehard fan of Test cricket

ముంబయి: పాత తరంలోనైనా.. ప్రస్తుత తరుణంలోనైనా.. భవిష్యత్తులోనైనా టెస్ట్ క్రికెటే అసలైన ఆటని టీమిండియా టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తెలిపాడు. ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్‌ ఎపిసోడ్‌లో మాట్లాడిన ఈ టీమిండియా నయావాల్.. టీ20,వన్డే ప్రపంచకప్‌లు గెలవడం కన్నా ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ సాధించడమే గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు. తాను సంప్రదాయక ఆటకు డైహార్డ్ ఫ్యానని తెలిపాడు.

మించింది ఏదీ లేదు..

మించింది ఏదీ లేదు..

'టెస్టు చాంపియన్‌గా అవతరించడానికి మించింది ఏదీ లేదు. టెస్టు క్రికెటే అసలైన ఆట. పాతతరం ఆటగాళ్లలో ఏ గొప్ప క్రికెటర్‌ను అడిగినా.. ప్రస్తుత ఆటగాళ్లను అడిగినా ఇదే విషయం చెబుతారు. అయితే, మెజారిటీ జట్లు స్వదేశంలో బాగా ఆడుతున్నా, విదేశాల్లో మాత్రం అసలైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా భారత్‌కు అవే సిరీస్‌ల్లో కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి, అయినా అక్కడ విజయాలు సాధించింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరే ఏ రెండు జట్లైనా రెండేళ్ల పాటు శ్రమించాలి. ఇంటా, బయటా కష్టపడి గెలవాలి' అని పుజారా చెప్పుకొచ్చాడు.

వారెవ్వా బుమ్రా.. ఏం స్వింగ్ అది, తక్కువ అంచానా వేస్తే ఇలానే ఉంటది (వీడియో)

సూపర్ ఐడియా..

సూపర్ ఐడియా..

టెస్టు క్రికెట్‌పై ఆదరణ తగ్గిపోతున్న వేళ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించడం బాగుందని కొనియాడాడు. టెస్ట్ హోదా కలిగిన జట్లు ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని పుజారా విజ్ఞప్తి చేశాడు. ‘టెస్టు క్రికెట్‌ మనుగడకు ఈ వేదిక సరైంది. ఈ మెగాటోర్నీతో డ్రా చేసుకోవాలనుకునే జట్లు కూడా విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతాయి. ఏ జట్టుకైనా మ్యాచ్‌లు గెలిస్తేనే ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఒకవేళ డ్రాగా ముగించుకుంటే కొన్ని పాయింట్లు వస్తాయి. మొత్తం మీద టెస్టు ఛాంపియన్‌షిప్‌ వల్ల ఈ ఆటలో పోటీతత్వం పెరుగుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.'అని పుజారా అభిప్రాయపడ్డాడు.

లంబూ లేచాడు.. న్యూజిలాండ్‌కు బయల్దేరాడు!!

తృటిలో సెంచరీ మిస్..

తృటిలో సెంచరీ మిస్..

న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టాపార్డర్ విఫలమైన వేళ.. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101 రిటైర్డ్‌ అవుట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి ఐదో వికెట్‌కు 195 పరుగులు జోడించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పుజారా బ్యాటింగ్‌కు రాకపోగా.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

టాప్‌లో భారత్..

టాప్‌లో భారత్..

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలైనప్పటి నుంచి భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సిరీస్‌ విజయాలతో 360 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్‌ను కూడా కైవసం చేసుకొవాలి కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది.

Story first published: Sunday, February 16, 2020, 15:15 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X