న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా బుమ్రా.. ఏం స్వింగ్ అది, తక్కువ అంచనా వేస్తే ఇలానే ఉంటది (వీడియో)

Watch Jasprit Bumrah bowls a ripper to dismiss Finn Allen in practice match against New Zealand XI

హమిల్టన్: హవ్వా.. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ తీయలేదు.! తన కెరీర్‌లో ఇదే చెత్త రికార్డు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యార్కర్ల కింగ్ బౌలింగ్‌లో పదును తగ్గింది. మునుపటంతా పదును లేదు.. అందుకే విఫలమవుతున్నాడు. అతను తన బౌలింగ్‌ను మార్చుకోవాలి.. అటాకింగ్ పెంచాలి. బుమ్రా వైఫల్యం వల్లనే భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఇలా.. ఒక్క సిరీస్‌లో విఫలమైన బుమ్రాపై అభిమానులు, మాజీలు, సీనియర్లు, విశ్లేషకులు.. ఇష్టం వచ్చినట్లు చేసిన కామెంట్లు ఇవి.

వీళ్లంతా ఒక్కసారి న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చూడాలి. ఇక ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసిన తీరును మరీమరి పరిశీలించాలి. ఆ వికెట్ తీసిన అతని బంతి.. స్వింగ్ చూస్తే వీళ్లంతా తామెంత తప్పుగా మాట్లాడామో రియలైజ్ అవ్వకుండా ఉండరు. అవును ఈ డికేడ్ బెస్ట్ బాల్ అని కూడా చెప్పవచ్చు. ఆ స్వింగ్.. ఆ బంతి.. ఆ వికెట్.. వారెవ్వా బుమ్రా.. నిజంగా నువ్వు తోపు బౌలర్ అని అనకుండా కూడా ఉండలేరు.

లంబూ లేచాడు.. న్యూజిలాండ్‌కు బయల్దేరాడు!!లంబూ లేచాడు.. న్యూజిలాండ్‌కు బయల్దేరాడు!!

తక్కువ అంచానా వేసి..

న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో అద్భుతం జరిగింది. అప్పటికే 82 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఫిన్ అలెన్, హెన్రీకూపర్ ఆచితూచి ఆడుతూ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 30 ఓవర్‌లో బంతి అందుకున్న బుమ్రా చక్కటి బంతితో ఫిన్ అలెన్(20)ను పెవిలియన్ చేర్చాడు. బంతి ఔట్‌సైడ్‌ ఆఫ్ స్టంప్‌గా వెళ్తుందని భావించిన అలెన్ బ్యాట్ పైకి ఎత్తి బంతిని వదిలేయాలనుకున్నాడు. కానీ అది బుమ్రా మార్క్ స్వింగ్‌తో సూపర్‌గా టర్నై అనూహ్యంగా వికెట్లు గిరాటేసింది. దీంతో షాక్‌కు గురైన అలెన్.. నిరాశగా పెవిలియన్ చేరాడు. తాను చాలా తప్పుగా అంచనా వేసాననే అపరాధ భావంతో క్రీజును వీడాడు.

మార్చి 29 నుంచే ఐపీఎల్‌ షురూ.. హైదరాబాద్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

బూమ్ బూమ్ బుమ్రా..

ఇక ఈ బౌలింగ్‌ను చూసిన అభిమానులకు సంభ్రమాశ్చర్యానికి లోనవుతున్నారు. ఓ మైగాడ్ అని ఒకరంటే.. బూమ్ బూమ్ బుమ్రా అని మరొకరు.. అత్యద్భుతమని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. బుమ్రా ఈజ్ బ్యాక్ అని కూడా కొనియాడుతున్నారు.

అదరగొట్టిన బౌలర్లు..

అదరగొట్టిన బౌలర్లు..

ఈ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్‌ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. వీరికి తోడుగా సైనీ 2 వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్టు 235 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్ రిషభ్ పంత్(70), మయాంక్(81) అగర్వాల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 48 ఓవర్లలో నాలుగు వికెట్లకు 252 పరుగులు చేసింది. దీంతో ఈ సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Story first published: Sunday, February 16, 2020, 21:16 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X