న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా పాత జట్టుకాదు పక్కా ఫైనల్ చేరుతుంది: ఆసీస్ మాజీ క్రికెటర్

Brett Lee Says Fearless Shafali Verma has been Brilliant to watch at Womens T20 World Cup

సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో భారత మహిళల జట్టు పక్కా ఫైనల్‌కు చేరుతుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ తెలిపాడు. ఆ సత్తా హర్మన్‌ప్రీత్ సేనకు ఉందన్నాడు. ఐసీసీకి రాసిన ఓ కాలమ్‌లో బ్రెట్‌లీ భారత అమ్మాయిలపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఒకప్పటి జట్టు కాదు..

ఒకప్పటి జట్టు కాదు..

మునుపెన్నడూ చూడనంత భిన్నంగా ప్రస్తుత భారత జట్టు ఉందని కొనియాడాడు. డాషింగ్ ఓపెనర్‌, 16 ఏళ్ల సంచలనం షెఫాలీ వర్మ సెమీస్‌లో భారీ స్కోరు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. షెఫాలీతో పాటు ఈ టోర్నీలో పూనమ్‌ యాదవ్‌ మ్యాచ్‌ విజేతగా అవతరించిందని ప్రశంసించాడు. హర్మన్‌ప్రీత్‌ సేన నాలుగు విజయాలతో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలవడంలో వీరిద్దరిది కీలక పాత్ర అని కొనియాడాడు.

మ్యాచ్ విన్నర్లతో సమతూకంగా..

మ్యాచ్ విన్నర్లతో సమతూకంగా..

సీనియర్లు, జూనియర్లతో భారత జట్టు సమతూకంగా ఉందని ఈ మాజీ పేసర్ తెలిపాడు. 'టీమ్‌ఇండియా గతంలో ఎప్పుడూ ఫైనల్‌ చేరుకోలేదు. కానీ మునుపెన్నడూ చూడని విధంగా భిన్నంగా ప్రస్తుత జట్టు ఉంది. బ్యాట్, బంతితో నిలకడగా రాణించే ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించే షెఫాలీ వర్మ, పూనమ్‌ యాదవ్‌లతో బలంగా సమతూకంగా ఉంది. ఆ జట్టులో కొందరు అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారని మనకు ఇంతకుముందే తెలుసు. చిన్నచిన్న లోపాలను సరిచేస్తూ, సీనియర్లకు సహకరించే అమ్మాయిలూ ఇప్పుడు ఆ జట్టులో ఉన్నారు. అదే వారి అదనపు బలం' అని లీ చెప్పుకొచ్చాడు.

పాండ్యా ఈజ్ బ్యాక్..10 సిక్సర్లతో విధ్వంసం.. 37 బంతుల్లోనే సెంచరీ

అద్భుతం జరిగితేనే..

అద్భుతం జరిగితేనే..

హర్మన్‌ప్రీత్ సేన వరుస విజయాలతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉందని, వారిని అడ్డుకోవాలంటే ప్రత్యర్థి జట్టు అద్భుతం చేయాలన్నాడు. ‘హర్మన్‌ సేన వరుస విజయాలతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ జట్టు కచ్చితంగా ఫైనల్‌ చేరుకుంటుంది. వారిని అడ్డుకోవాలంటే ప్రత్యర్థి ప్రత్యేకమైన జట్టై ఉండాలి. లేక అద్భుతమన్నా జరగాలి. టాప్‌ ఆర్డర్లో షెఫాలీ వర్మకు తిరుగులేదు. ఆమె ఫియెర్ లెస్ ఆట భారత బ్యాటింగ్‌కు బలం చేకూర్చింది. అర్ధశతకం చేయనప్పటికీ ఆమె ఇంకా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడగలదు. ఆమె ఆటను చూడటం అభిమానులకు ఉత్కంఠగా, బౌలర్లకు ఆందోళనకరంగా అనిపిస్తుంది. తొలి మ్యాచులో ఆసీస్‌ను టీమిండియా ఎలా ఓడించిందో మనం చూశాం. అలాంటి జట్టు గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలవడంలో ఆశ్చర్యమేమీ లేదు' అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

‘భారత్‌కు వచ్చినప్పుడు.. నేనేంటో చూపిస్తా'మైదానంలో కోహ్లీ వార్నింగ్!!

భారత్ ప్రత్యర్థి ఇంగ్లండ్..

భారత్ ప్రత్యర్థి ఇంగ్లండ్..

మంగళవారం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడుకుండానే రద్దయింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఫలితంగా సౌతాఫ్రికా గ్రూప్-బి టాపార్‌గా నిలవగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో గురువారం జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్, ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడనున్నాయి.

Story first published: Tuesday, March 3, 2020, 21:04 [IST]
Other articles published on Mar 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X