న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘భారత్‌కు వచ్చినప్పుడు.. నేనేంటో చూపిస్తా’మైదానంలో కోహ్లీ వార్నింగ్!!

‘I will show them when they come to India’ Virat Kohli heard saying during New Zealand’s 2nd innings in Christchurch

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ ఓటమి కన్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహారశైలినే తీవ్ర చర్చనీయాంశమైంది. ఆతిథ్య ఆటగాళ్లు ఔటైన సందర్భంలో కొంత అతిగా ప్రవర్తించిన భారత్ కెప్టెన్.. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన లోకల్ జర్నలిస్ట్‌పై నోరుపారేసుకున్నాడు. అంతేకాకుండా చివరి రోజు ఆటలో ఒకప్పటి కోహ్లీని తలపించాడు.

కివీస్ బ్యాటింగ్ సందర్భంగా నోరుకు పనిచెబుతూ స్లెడ్జింగ్‌కు దిగి అంపైర్ మందలింపు‌నకు కూడా గురయ్యాడు. మ్యాచ్ ముగిసినా.. భారత్ 0-2తో చిత్తుగా ఓడినా.. ఇవేవి పట్టించుకోని ఫ్యాన్స్ కోహ్లీ వ్యవహారి శైలినే తప్పబడుతున్నారు.. మైదానంలో కోహ్లీ అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు.

అంపైర్ మందలింపు..

అంపైర్ మందలింపు..

ఇక...సోమవారంనాటి ఆటలో సహచరుడు చేసిన వ్యాఖ్యలకు కోహ్లీని అంపైర్‌ కెటిల్‌బరో మందలించాడు. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతిని లాథమ్‌ ఫైన్‌లెగ్‌లోకి కొట్టి ఓ పరుగు తీయగా.. టీమిండియా ఫీల్డర్‌ ఒకరు ‘టు' అని అనడంతో కెటిల్‌బరో ఆగ్రహించాడు. అలా అనడం..కివీస్‌ ఆటగాడు రెండో పరుగు చేయకుండా అడ్డుకొనే ప్రయత్నమంటూ ‘అలా అరవొద్దు' అని కోహ్లీని మందలించాడు. అయితే ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఆటగాడిని అప్రమత్తం చేసేందుకు..సదరు ఫీల్డర్‌ అలా అన్నాడని అంపైర్‌కు కోహ్లీ వివరణ ఇచ్చుకున్నాడు.

ICC Women's T20 World Cup: సెమీస్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్

 భారత్‌కు వచ్చినప్పుడు చెబుతా..

భారత్‌కు వచ్చినప్పుడు చెబుతా..

ఇక ఎక్కువ భాగం స్లిప్‌లో ఫీల్డ్ చేసిన కోహ్లీ తన వ్యవహారశైలికి భిన్నంగా ప్రవర్తించాడు. కివీస్ ఆటగాళ్లు విజయానికి సమీపించే తరుణంలో భారత్‌కు వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని సహచర ఆటగాళ్లతో హిందీలో వ్యాఖ్యానించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

అసభ్య పదజాలం..

అసభ్య పదజాలం..

ఇక విలియమ్సన్ ఔటైనప్పుడు సెండాఫ్ ఇచ్చే క్రమంలో కోహ్లీ అతిగా ప్రవర్తించాడు. నోరు మూసుకోవాలనే అర్థం వచ్చేలా సైగలు చేస్తూ.. బూతుపురాణం అందుకున్నాడు. ఆ వెంటనే ప్రేక్షకులను కూడా తిట్టాడు. ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ మీడియా సమావేశంలో ప్రస్తావించగా అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. సగం సగం తెలుసుకొని ప్రశ్నలు అడగవద్దని, పూర్తి సమాచారంతో రావాలని సూచించాడు. మైదానంలో జరిగిన ఘటనపై మ్యాచ్ రిఫరీతో తాను మాట్లాడానని, అతనేలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నాడు. వివాదం సృష్టించడానికి ఇది సరైన వేదిక కాదని సదరు జర్నలిస్ట్‌ను మందలించాడు.

కోహ్లీ ప్యాషన్ అది..

కోహ్లీ ప్యాషన్ అది..

కోహ్లీ మైదానంలో వ్యవహరించిన తీరుపై మ్యాచ్‌ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ప్రశ్నిస్తే.. సమాధానంగా ఓ చిరునవ్వు నవ్వాడు. అది విరాట్ విలక్షణమైన తీరని సమాధానమిచ్చాడు. ‘అది ఆటపై విరాట్‌కు ఉన్న ప్యాషన్. ఆ ఘటనను మేం బూతద్దంలో చూడాలనుకోవడం లేదు'అని తెలిపాడు.

Story first published: Tuesday, March 3, 2020, 14:52 [IST]
Other articles published on Mar 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X