Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దిలీప్.. వాట్ ఆర్ యు డూయింగ్..?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా ఫీల్డింగ్ మరి దారుణంగా తయారైంది. కళ్లు చెదిరే క్యాచ్‌లు దేవుడెరుగు.. క్యాచ్ పడితే గొప్ప అనే స్థాయికి టీమిండియా ఫీల్డింగ్ దిగజారింది. మెగా టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 13 క్యాచ్‌లను నేలపాలు చేసింది.

భారత్ క్యాచింగ్ సక్సెస్ రేటు కేవలం 72.7 శాతం మాత్రమే. ఇది సూపర్-8కు చేరిన అన్ని జట్ల కంటే అత్యంత తక్కువ. ఫీల్డింగ్ నాణ్యతలో భారత్ ప్రస్తుతం ఆఖరి స్థానంలో నిలిచింది. చెత్త ఫీల్డింగ్‌కు కెరాఫ్ అడ్రస్ అయిన పాకిస్థాన్ కూడా భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. పాకిస్థాన్ క్యాచింగ్ సక్సెస్ రేటు 83.3 శాతం ఉంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా ముంబై వేదికగా గురువారం జరిగే సెమీఫైనల్-2లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను కలవరపెడుతున్న ఏకైక అంశం ఏదైనా ఉందా? అంటే అది ఫీల్డింగ్ మాత్రమే. వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 3 క్యాచ్‌లు నేలపాలు చేయడంతో పాటు రెండు రనౌట్ అవకాశాలను చేజార్చింది.

Fans Slam Fielding Coach T Dilip as India Records Lowest Catching Efficiency in T20 World Cup 2026

ఇందులో అభిషేక్ శర్మ రెండు క్యాచ్‌లు నేలపాలు చేయగా.. తిలక్ వర్మ ఒక్కటి వదిలేసాడు. సంజూ శాంసన్(50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా గట్టెక్కింది. లేకుంటే టీమిండియా చెత్త ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యేవి. పాకిస్థాన్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అత్యధికంగా 4 క్యాచ్‌లు వదిలేసారు. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేయడంతో ఈ తప్పిదాలు పెద్ద నష్టం చేయలేదు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అద్భుతమైన ఫీల్డింగ్ చేసింది. ఈ టోర్నీల సమయంలో అత్యుత్తమ క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో మెడల్స్ అందించేవారు. ఆ మెడల్స్‌ను వినూత్న రీతిలో ప్రకటిస్తూ.. భారత అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఆటగాళ్లు కూడా అత్యత్తమ ఫీల్డింగ్ మెడల్ కోసం తెగ కష్టపడ్డారు.

కానీ అదే ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ఉండగానే భారత్ ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ తమ ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో ఇలా క్యాచ్‌లు వదిలేస్తే మ్యాచ్‌ కూడా చేజారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా దిలీప్.. భారత ఆటగాళ్లతో ప్రత్యేకమైన ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాలని సూచిస్తున్నారు.

Story first published: Wednesday, March 4, 2026, 20:15 [IST]
Other articles published on Mar 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+