For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా, సంజూ కాదు.. అతని వల్లే భారత్‌కు విజయం!

'క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి'.. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నుంచి వచ్చిన మాట. తాను సంజూ శాంసన్ క్యాచ్‌ వదిలేసి ఇంగ్లండ్ ఓటమికి కారణమయ్యానని బ్రూక్ అంగీకరించాడు. మరోవైపు భారత వైస్ కెప్టెన్ స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మాత్రం మూడు స్టన్నింగ్ క్యాచ్‌లతో ఔరా అనిపించాడు. అతను పట్టిన ఈ మూడు క్యాచ్‌లే భారత్‌ను విజేతగా నిలబెట్టాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంజూ శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 254 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించినా.. తనకే సాధ్యమైన బౌలింగ్‌తో జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌ను కట్టడి చేసినా.. అక్షర్ పటేల్ ఈ మూడు క్యాచ్‌లు అందుకోకపోయి ఉంటే భారత్ గెలిచేది కాదని బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యంగా విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌పై అక్షర్ పటేల్ పట్టకపోయి ఉంటే ఇంగ్లండ్ ఈజీగా విజయం సాధించేదని అభిప్రాయపడుతున్నారు. 77 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విడదీసిన ఈ క్యాచ్‌ మ్యాచ్‌‌కు టర్నింగ్ పాయింట్ అని చెబుతున్నారు.

Not Just Bumrah or Sanju Experts Credit Axar Patel Electrifying Fielding for India s Semifinal Win

ఈ క్యాచ్ పట్టగానే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డగౌట్‌లో ఎగిరి గంతేసాడు. తన ముందున్న టేబుల్‌ను గట్టిగా బాదుతూ సెలెబ్రేట్ చేసుకోగా.. భారత ఆటగాళ్లు మ్యాచ్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఈ ఒక్క క్యాచే కాదు.. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్యాచ్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేంజరస్ ఫిల్ సాల్ట్ క్యాచ్‌లను కూడా అక్షర్ పటేలే అందుకున్నాడు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను వెనక్కి పరుగెత్తి అందుకున్న తీరు అద్భుతం. దాంతోనే అక్షర్ పటేల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బాపూ.. నువ్వు తోపు అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

బౌలింగ్‌లోనూ అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసాడు. దూకుడుగా ఆడిన టామ్ బాంటన్(17)‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బ్యాటింగ్‌లో 2 బంతులే ఎదుర్కొన్న అక్షర్ పటేల్.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం ఇరగదీసాడు. ఫీల్డింగ్‌తోనూ జట్టును గెలిపించవచ్చని నిరూపించాడు. విల్ జాక్స్ క్యాచ్.. శివమ్ దూబే ఖాతాలోకి వెళ్లిపోయినా.. ఈ క్యాచ్ క్రెడిట్ పూర్తిగా అక్షర్ పటేల్‌దే. అతనే బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకొని పక్కనే ఉన్న శివమ్ దూబేకు అందించాడు. దాంతోనే బుమ్రా, సంజూనే కాదు.. అక్షర్ పటేల్ కూడా మ్యాచ్ విన్నర్ అని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు కితాబిస్తున్నారు.

Take a Poll
Story first published: Friday, March 6, 2026, 9:17 [IST]
Other articles published on Mar 6, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+