న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ వివాదం మా స్నేహాన్నే పాడు చేసింది: మెక్‌కలమ్‌

Brendon McCullum Says We are Not Best Friends’ on Fallout with Ross Taylor

వెల్లింగ్టన్ : రాస్‌టేలర్‌తో జరిగిన కెప్టెన్సీ వివాదం న్యూజిలాండ్‌ క్రికెట్‌లో‌నే మాయనిమచ్చగా మిగిలిపోయిందని ఆ జట్టు మాజీ క్రికెటర్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ తెలిపాడు. ఈ ఉదంతం కారణంగా తమ స్నేహం చెడిపోయిందన్నాడు. స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కివీస్‌ మాజీ కెప్టెన్ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు. అండర్‌ 19 జట్టులోనే రాస్ టేలర్, తాను మంచి స్నేహితులమని మెక్‌కలమ్‌ తెలిపాడు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

2011లో డానియల్‌ వెటోరీ న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా వైదొలగాక రాస్‌టేలర్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అయితే, నాటి కోచ్‌ మైక్‌హెసన్‌తో అతడికి సఖ్యత కుదరలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో టెస్టు సిరీస్‌ పూర్తయ్యాక అతడిని కెప్టెన్‌గా తొలగించి మెక్‌కలమ్‌కు బాధ్యతలు అప్పగించారు.

దానికి టేలర్ నిరాకరించాడు..

దానికి టేలర్ నిరాకరించాడు..

‘కెప్టెన్‌గా నన్ను నియమించక ముందే కివీస్‌ బోర్డు ఇద్దరి కెప్టెన్ల ప్రతిపాదనను టేలర్ ముందు ఉంచింది. అయితే దానికి అతను నిరాకరించాడు. నన్ను కూడా బోర్డు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగుతావా? అని అడిగితే.. కాస్త ఆలోచించుకొని సమాధానం చెబుతానని తొలుత చెప్పినా.. తర్వాత నా సతీమణితో చర్చించి కెప్టెన్సీకి ఒప్పుకున్నాను. ఆ తర్వాత టేలర్‌ను తొలగించి నాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.'అని అప్పుడేం జరిగిందో నిజంగా తనకు తెలియదని మెక్‌కల్లమ్ తెలిపాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారిందని, ఇప్పుడు ఆ పరిస్థితులు దాటి న్యూజిలాండ్‌ క్రికెట్‌ కోలుకుందన్నాడు.

సఖ్యత కుదరకనే..

సఖ్యత కుదరకనే..

శ్రీలంక టెస్టు సిరీస్‌ డ్రాగా ముగిసిందని గాలే టెస్టులో రాస్‌టేలర్‌ ఒకలా ఆడాలనుకున్నాడని, కోచ్‌ మైక్‌ హెసన్‌ మరోలా ఆడించాలనుకున్నాడని ఈ కివీస్ మాజీ కెప్టెన్ తెలిపాడు. ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదన్నాడు. ఆ సమయంలో టేలర్‌కు అండగా నిలిచేందుకు ప్రయత్నించానన్నాడు.

రోహిత్ గాయమే కోహ్లీసేన కొంప ముంచింది: న్యూజిలాండ్ పేసర్

మీడియా కథనాలే..

మీడియా కథనాలే..

అయితే, అదే సమయంలో తాను కోచ్‌తో సన్నిహితంగా ఉండి.. టేలర్‌ కెప్టెన్సీపై కన్నేశానని మీడియాలో కథనాలు వచ్చినట్లు మెక్‌కలమ్‌ గుర్తు చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే.. ఆ విషయంలో తనకో స్పష్టత ఉందని, ఒకవేళ టేలర్‌తో హెసన్‌కు సరిపడకపోతే.. తననే కెప్టెన్‌గా చేయాలనే ఆలోచనలో కోచ్‌ ఉన్నాడనే విషయం తనకు తెలుసని స్పష్టం చేశాడు. ఈ కారణంగానే తమ మధ్య దూరం పెరిగిందన్నాడు.

Story first published: Sunday, March 22, 2020, 18:49 [IST]
Other articles published on Mar 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X