న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాడ్ హగ్ ఈ తరం అత్యత్తమ వన్డే జట్టు.. ఐదుగురు భారత ఆటగాళ్లే!

Brad Hogg selects his current best ODI XI

సిడ్నీ: కరోనా పుణ్యమా యావత్ ప్రపంచం గత మూడు నెలలుగా లాక్‌డౌన్ అయింది. క్రికెట్ టోర్నీలన్ని నిలిచిపోయాయి. దీంతో చాలా మంది ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఫాంటసీ క్రికెట్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే బెస్ట్ ఎలెవన్ జట్ల ప్రకటనలు తెరపైకి వచ్చాయి.

ఇప్పటికే చాలా మంది మాజీ ఆటగాళ్లు తమ అత్యుత్తమ జట్లను ప్రకటించారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఈ తరం అత్యుత్తమ వన్డే జట్టును ప్రకటించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా శనివారం ఈ వివరాలను వెల్లడించాడు. ఇక ఈ జట్టులో అత్యధికంగా ఐదుగురు భారత ఆటగాళ్లను తీసుకున్న ఈ ఆసీస్ మాజీ స్పిన్నర్.. ఆశ్చర్యకరంగా వరల్డ్ క్లాస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు చొప్పున తీసుకున్న బ్రాడ్.. పాకిస్థాన్, న్యూజిలాండ్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశాడు.

ఓపెనర్లుగా రోహిత్, వార్నర్..

ఈ బెస్ట్ ఎలెవన్ వన్డే జట్టు ఓపెనర్లుగా విధ్వంసకర ఆటగాళ్లైన రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను తీసుకున్నాడు. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే. మూడో స్థానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేసిన బ్రాడ్.. నాలుగో స్థానంలో పాక్‌కు చెందిన బాబర్ ఆజమ్‌‌కు అవకాశం ఇచ్చాడు. ఇక బాబర్ కూడా పాకిస్థాన్ తరఫున మూడో స్థానంలోనే ఆడుతాడన్న విషయం తెలిసిందే.

తప్పుగా అర్థం చేసుకోవద్దు.. స్వరాభాస్కర్ ట్వీట్‌కు స్పందించిన సామీ

ఆల్‌రౌండర్లుగా స్టోక్స్, జడేజా..

ఆల్‌రౌండర్లుగా స్టోక్స్, జడేజా..

ప్రపంచకప్‌లో హీరోచిత ప్రదర్శనలు కనబర్చిన ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలను ఆల్‌రౌండర్లుగా ఎంపిక చేశాడు. స్టోక్స్‌ను ఐదో స్థానంలో తీసుకున్న ఈ చైనామన్ బౌలర్.. ఆరో స్థానంలో వికెట్ కీపర్‌‌గా జోసబట్లర్‌కు అవకాశం ఇచ్చాడు. ఏడో స్థానాన్ని జడేజాకు కేటాయించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జడేజా బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్లో స్టోక్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.

బుమ్రాకు నో చాన్స్..

బుమ్రాకు నో చాన్స్..

ఇక భారత్ నుంచి ఐదుగురు ఆటగాళ్లను ఎంపిక చేసిన బ్రాడ్ హగ్.. వరల్డ్ నెంబర్ వన్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వలేదు. అనూహ్యంగా అతనికి బదులు షమీకి అవకాశం ఇచ్చాడు. మిచెల్ స్టార్క్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీలతో పేస్ త్రయాన్ని పూర్తి చేశాడు. ఇక జడేజాకు తోడుగా ఏకైక స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకున్నాడు.

అఫ్రిది పాపం పండింది.. అందుకే కరోనా సోకింది!

అన్‌లక్కీ ఆటగాళ్లు..

అన్‌లక్కీ ఆటగాళ్లు..

ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ తృటిలో అవకాశాన్ని చేజార్చుకున్నారని బ్రాడ్ హగ్ తెలిపాడు. ఫించ్ గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చినా.. టాప్-4 బ్యాట్స్‌మన్‌తో పోలిస్తే కొంచెం వెనుకబడి ఉన్నాడు. ఇక కేన్ విలియమ్సన్ కూడా విరాట్ కోహ్లీతో పోడీనప్పటికీ.. స్ట్రైక్ రేట్ కారణంగా అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడని హాగ్ తెలిపాడు.

బ్రాడ్ హగ్ ఈతరం వన్డే ఎలెవన్..

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), బాబర్ ఆజమ్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కీపర్), రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్

Story first published: Saturday, June 13, 2020, 19:59 [IST]
Other articles published on Jun 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X