న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పుగా అర్థం చేసుకోవద్దు.. స్వరాభాస్కర్ ట్వీట్‌కు స్పందించిన సామీ

Darren Sammy responds to Swara Bhaskar’s call for apology from Sunrisers Hyderabad players

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా తాను జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2013, 2014 సీజన్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్‌ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. సహచర ఆటగాళ్లంతా తనని కాలూ(నల్లోడా) అని పిలిచేవారని అప్పట్లో దాని అర్థం తనకు తెలియదని.. ఈ మధ్యే ఆ పదం మీనింగ్ తెలుసుకొని చాలా బాధపడ్డానని తెలిపాడు.

అంతేకాకుండా తనను అలా పిలిచిన ఆటగాళ్లంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఎవరెవరు అలా పిలిచారో వారికి తెలుసని, వారంతా తనతో ఫోన్, ట్విటర్, ఫేస్‌బుక్ ఇలా ఏదో మాధ్యమం ద్వారా తనతో మాట్లాడి వివరణ ఇవ్వాలని కోరాడు.

ముగింపునిచ్చే ప్రయత్నం..

ముగింపునిచ్చే ప్రయత్నం..

ఇన్ని వ్యాఖ్యలు చేసిన సామీ శుక్రవారం ఈ వివాదానికి ముగింపునిచ్చే ప్రయత్నం చేశాడు. తనను నల్లోడా అని పిలిచిన సదరు క్రికెటర్‌ తనతో అభిమానంగా మాట్లాడాడని,

ఇక ప్రత్యేకంగా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని చెప్పాడు. ‘నన్ను ‘కాలూ' అని పిలిచిన ఆ క్రికెటర్ నాతో మాట్లాడాడు. ఈ విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వర్ణ వివక్షపై దుష్ప్రచారలను అపేసి అందరికి అవగాహన కల్పించాలనుకున్నాం. అప్పుడు ప్రేమతోనే అలా పిలిచానని నా బ్రదర్ నాకు భరోసా ఇచ్చాడు. నేను అతణ్ని పూర్తిగా నమ్ముతున్నాను' అని సామీ ట్వీట్ చేశాడు.

ఇంకొకరు ఇలానే అంటే ఏం చేస్తావ్?

ఇంకొకరు ఇలానే అంటే ఏం చేస్తావ్?

ఇక సామీ ట్వీట్‌పై బాలీవుడ్ హీరోయిన్ స్వరాభాస్కర్ స్పందించింది. సామీ చాలా అమయాకంగా కనిపిస్తున్నాడని పేర్కొంది. మరొకరు ఇలానే శరీర రంగును ప్రస్తావిస్తూ ఓ పదాన్ని వాడి ప్రేమతోనే పిలిచానంటే ఏం చేస్తావని ప్రశ్నించింది. ‘డియర్ సామీ.. ఇంకొకరు ఇలానే శరీర రంగును ప్రస్తావిస్తూ మరో పదం వాడి.. ప్రేమతోనే పిలిచానని అంటే ఏం చేప్తావ్? ‘కాలు'అని పిలవడం కూడా ఇలాంటిదే. ఇక సన్ రైజర్స్ ఆటగాళ్లు కొంచెం మర్యాదగా వ్యవహరించండి. సామీకి బేషరతుగా క్షమాపణలు చెప్పండి. ఇది ఏమాత్రం క్రికెట్ కాదు'అంటూ స్వరా భాస్కర్ ట్వీట్ చేసింది.

అపార్థం చేసుకోవద్దు..

అపార్థం చేసుకోవద్దు..

ఇక స్వరా ట్వీట్‌పై సామీ కూడా స్పందించాడు. తానేమి రాజీపడటం లేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచించాడు. ‘నేనేం రాజీపడటం లేదు. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ‌ ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఇతరులకు అవగాహన కల్పించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని మాత్రమే చెబుతున్నా. తప్పు చేశామని భావిస్తేనే క్షమాపణలు చెప్పాలి. నల్లజాతీయుడిగా ఉండటం నాకు ఎప్పటికీ గర్వకారణమే. అది ఎప్పటికీ మారదు'అని సామీ బదులిచ్చాడు.

అందుకే నాకు నేను పిలుచుకున్నా..

అందుకే నాకు నేను పిలుచుకున్నా..

ఇక తనను నల్లోడా అని పిలిచారని సామీ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా సాక్ష్యాలు లభించాయి. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన ఇషాంత్ శర్మ.. సామీని 'కాలు' అని పిలుస్తూ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అయింది. ఇక సామీ కూడా తనకు తాను ‘కాలు'అని పిలుచుకున్నాడు. 2014లో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ బర్త్‌డే సందర్బంగా అతనికి విషేస్ తెలియజేస్తూ.. తనకు తాను కాలూగా పిలుచుకుంటూ ట్వీట్ చేశాడు. అయితే తాజాగా ఈట్వీట్‌పై ఈ కరెబీయన్ వివరణ ఇచ్చాడు.

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌తో మాట్లాడుతూ.. కాలూ అంటే బలమైన వ్యక్తి అనుకున్నానని తెలిపాడు. అందుకే తనకు తాను అలా పిలుచుకున్నానని స్పష్టం చేశాడు.

ఒక్క బంతికే 17 పరుగులు.. పాక్‌పై సెహ్వాగ్ అరుదైన రికార్డు!

Story first published: Saturday, June 13, 2020, 15:29 [IST]
Other articles published on Jun 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X