న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా, బెన్‌స్టోక్స్.. బెస్ట్ ఆల్‌రౌండర్ ఎవరో చెప్పిన బ్రాడ్ హగ్

Brad Hogg picks a better all-rounder between Ben Stokes and Hardik Pandya

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అడుగు తీసి బయటకు పెట్టలేని దారుణ పరిస్థితిని తీసుకొచ్చింది. దీని దెబ్బకు క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలోనే ఉంటున్నా వారందరికి ఒక్క విషయంలో ఉపశమనం లభించింది. అది సోషల్ మీడియా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని ఇది కలుపుతోంది. సరదాగా చిట్‌చాట్ చేసుకోవడానికి వేదికగా నిలుస్తోంది.

ఫ్యాన్స్‌తో చిట్‌చాట్

ఫ్యాన్స్‌తో చిట్‌చాట్

ఈ నేపథ్యంలో క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వివాదాలు రేపాలన్నా, దేనిపైనైనా ఆసక్తికర చర్చ తెరపైకి తీసుకరావాలన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే వారు మాటలతో యుద్దం చేయగలరు.. అదేవిధంగా గారడీ చేయగలరు. ఈ నేపథ్యంలోనే ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర చర్చను తీసుకొచ్చాడు.

ఓ కోహ్లీ ఒక కోటి ఇవ్వరాదు.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు విరాళలు ప్రకటించరే?

బెస్ట్ ఆల్‌రౌండర్ డిబేట్..

బెస్ట్ ఆల్‌రౌండర్ డిబేట్..

ప్రస్తుత క్రికెటర్ల తరంలో బెన్‌ స్టోక్స్‌, హార్దిక్‌ పాండ్యాలలో బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ ఎవరంటూ అభిమానులను ప్రశ్నించాడు. దీనిపై నెటిజన్లు తమకు తోచిన అభిప్రాయాలను తెలిపారు. చివరకు తనకు మాత్రం బెన్ స్టోక్సే బెస్ట్ ఆల్‌రౌండరని ఈ డిబేట్‌ను ముగించాడు. బెన్‌ స్టోక్స్‌నే ఎందుకు ఎంచుకున్నాననే విషయంపై కూడా వివరణ ఇచ్చాడు. స్టోక్స్‌తో సమానమైన సామర్థ్యం హార్దిక్‌ పాండ్యాకు ఉందని, కానీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం పాండ్యాకు ఎక్కువ లేకపోవడంతోనే తాను స్టోక్స్‌ వైపు మొగ్గు చూపానని తెలిపాడు.

వరల్డ్‌కప్ హీరో..

వరల్డ్‌కప్ హీరో..

స్టోక్స్‌ ఇప్పటివరకు 63 టెస్టులు, 95 వన్డేలు, 26 టీ20ల్లో ఇంగ్లండ్‌ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ గెలుచుకోవడంలో స్టోక్స్‌ కీలక పాత్ర పోషించాడు. కాగా, హార్దిక్‌ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20లు భారత్‌ తరుపున ఆడాడు. వెన్ను గాయం కారణంగా గత కొంతకాలంగా పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, March 24, 2020, 22:13 [IST]
Other articles published on Mar 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X