న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాటే కోఇన్సిడెన్స్.. ఫస్ట్ వన్డేలో ఇండియా.. సెకండ్ వన్డేలో ఆసీస్.!

Best reactions after India registers a convincing win in the 2nd ODI

ఇండియా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో ఓ ఆసక్తికరమైన గణాంకం నమోదైంది. కాకతాళీయమో ఏమో కానీ తొలి వన్డేలో ఓడిన ఇండియా 49.1 ఓవర్లలో ఆలౌటవ్వగా.. రెండో వన్డేలో పరాజయంపాలైన ఆసీస్ కూడా 49.1 ఓవర్లలోనే కుప్పకూలింది. యాదృశ్చికంగా నమోదైన ఈ గణంకాలు క్రికెట్ సర్కిల్లో చర్చనీయాంశమయ్యాయి.

జూలు విధిల్చిన ఇండియా

జూలు విధిల్చిన ఇండియా

వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇండియాపై ఆసీస్ 10 వికెట్లతో గెలుపొందింది. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్, ఫించ్ అద్భుత శతకాలతో అద్భుత విజయాన్నందించారు. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన రాజ్‌కోట్ వన్డేలో ఇండియా జూలు విధిల్చింది. నేలకు కొట్టిన బంతిలా దూసుకొచ్చి.. అద్భుత విజయంతో లెక్క సరిచేసింది. శిఖర్ ధావన్(96) దంచికొడితే.. రాహుల్(80) బ్యాటింగ్.. కీపింగ్(రెండు క్యాచ్‌లు, ఒక స్టంపౌట్) రఫ్ఫాడించాడు. వీరి మధ్యలో నేనేం తక్కువనా అన్నట్లు కెప్టెన్ కోహ్లీ(78) చెలరేగాడు. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఇండియా 36 పరుగులతో గెలుపొందింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇక డిసైడర్ మ్యాచ్ ఆదివారం బెంగళూరులో జరగనుంది.

వారి వీడియోలను బాగా చూశా : రాహుల్

రాజ్‌కోట్‌లో తొలి విజయం..

రాజ్‌కోట్‌లో తొలి విజయం..

ఈ గెలుపుతో కోహ్లీసేన రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. గతంలో జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్‌(98), లబుషేన్‌(44) హాఫ్ సెంచరీలతో రాణించారు

సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు

సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా సెంచరీ సాధించలేదు. అయినప్పటికీ అత్యధిక పరుగులు నమోదు చేసిన మ్యాచ్‌గా ఈ వన్డే రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి మొత్తం 644 పరుగులు నమోదు చేశాయి.

Story first published: Saturday, January 18, 2020, 15:58 [IST]
Other articles published on Jan 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X