న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి వీడియోలను బాగా చూశా : రాహుల్

IND VS AUS 2020 : KL Rahul Says 'I Watched Videos Of Smith About How To Build Innings' || Oneindia
Watched videos of Steve Smith, AB de Villiers: KL Rahul on batting in middle-order

రాజ్‌కోట్ : రోజుకో స్థానంలో బరిలోకి దిగుతూ అటు బ్యాటింగ్‌లో.. ఇటు కీపింగ్‌లో రాణించడం పట్ల టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్, కీపింగ్‌లో మెరిసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన సక్సెస్ సీక్రెట్‌తో పాటు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

'రోజుకో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ నా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తర్వాత కొన్ని బంతులు ఎదుర్కోవాలని అనుకున్నా.

వికెట్ ఎంతో బాగుందని, బంతి బ్యాట్‌పైకి వస్తుందని విరాట్ నాతో చెప్పాడు. కొన్ని బంతులు సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించాక విశ్వాసం మరింత పెరిగింది. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పినందుకు సంతోషంగా ఉంది.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

రాజ్‌కోట్ వన్డే: తన కీపింగ్, బ్యాటింగ్‌తో ధోనిని గుర్తుచేసిన రాహుల్రాజ్‌కోట్ వన్డే: తన కీపింగ్, బ్యాటింగ్‌తో ధోనిని గుర్తుచేసిన రాహుల్

హోంవర్క్ చేశా..

హోంవర్క్ చేశా..

మిడిలార్డర్‌లో బరిలో దిగేముందు కొంత హోం వర్క్ చేశానని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ తెలిపాడు. ‘మిడిలార్డర్‌లో రాణించడానికి నేను కొంత హోం వర్క్ చేశా. చాలా మంది మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌తో మాట్లాడా. మైదానంలో ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించా. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో చాలా మాట్లాడా.

అంతేకాకుండా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్, ఆసీస్ లెజెండ్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ వీడియోలను ఎక్కువగా చూశా. వారు ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నా. ఇది నా ఆటకు చాలా ఉపయోగపడింది.'అని రాహుల్ తన సక్సెస్ సీక్రెట్‌ను చెప్పాడు.

కీపింగ్ బాగా చేస్తున్నంటా..

కీపింగ్ బాగా చేస్తున్నంటా..

కీపింగ్ బాగాచేస్తున్నానని తన సహచరులు మెచ్చుకుంటున్నారని రాహుల్ చెప్పాడు. ‘వికెట్ కీపింగ్ బాగా చేస్తున్నానని కుల్‌దీప్ చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వికెట్ కీపింగ్ చేశాను. కానీ ఎక్కువగా చేయలేదు. అయితే ఇటీవల కర్ణాటక తరఫున దేశవాళీ టోర్నీల్లో కీపింగ్ చేయడంతో దానిపై పట్టుచిక్కింది. మా స్పిన్నర్లు, పేసర్లను సంతోషంగా ఉంచుతాననే నమ్మకం నాకుంది. 'అని రాహుల్ తెలిపాడు.

పంత్ కన్నా బెటర్..

పంత్ కన్నా బెటర్..

గాయంతో రిషబ్ పంత్ దూరమవ్వడంతో కీపర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన రాహుల్.. వికెట్ల వెనుకాల అతనికన్నా మెరుగ్గా రాణిస్తున్నాడు. రెండో వన్డేలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రెప్పపాటు సమయంలో స్టంపౌట్ చేసి ధోని మార్క్ కీపింగ్‌ను గుర్తుచేశాడు. జడేజా వేసిన 16వ ఓవర్ చివరి బంతిని తప్పుగా అంచనా వేసిన ఫించ్ పిచ్ దాటాడు.

దీంతో బంతినందుకున్న రాహుల్ అంతే వేగంతో వికెట్లను కొట్టేసి ఫలితాన్ని అందుకున్నాడు. ఇక చివర్లో సైనీ వేసిన 47వ ఓవర్ మూడో బంతి మిచెల్ స్టార్క్‌ బ్యాట్‌ను తగిలి బౌన్స్ అవ్వగా రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు. ఈ రెండు వికెట్లు ఈ కర్ణాటక ప్లేయర్ కీపింగ్ టాలెంట్‌కు అద్దం పడుతున్నాయి.

ఇక రెండో వన్డేలో భారత్ 36 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్(98), కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80), రోహిత్ శర్మ (42) రాణించగా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో కోహ్లీ సేన సునాయస విజయాన్నందుకుంది. డిసైడర్ వన్డే బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, January 18, 2020, 16:01 [IST]
Other articles published on Jan 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X