న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ నుంచి అదో చెత్త ఫిర్యాదు.. అలాంటి బిత్తిరి మాటలు ఎక్కడా వినలేదు: బెన్ స్టోక్స్

Ben Stokes on Virat Kohlis comments on Edgbaston size at 2019 World Cup

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మండిపడ్డాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో తమతో జరిగిన మ్యాచ్ ఫలితంపై కోహ్లీ చేసిన వ్యాఖ్యలను ఈ ఇంగ్లండ్ క్రికెటర్ తప్పుబట్టాడు. న్యూజిలాండ్ సంతతికి చెందిన స్టోక్స్ 2015 ప్రపంచ కప్ నిష్క్రమణ నుంచి 2019 వరల్డ్‌కప్ అందుకునే వరకు సాగిన ఇంగ్లండ్ టీమ్ ప్రయాణాన్ని బుక్ రూపంలో తన స్వీయ అక్షరాలతో తీసుకొచ్చాడు. దానికి 'బెన్‌స్టోక్స్ ఆన్ ఫైర్'అని నామకరణం చేశాడు.

ఇక న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో స్టోక్స్ ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆద్యాంతం నాటకీయంగా సాగిన నాటి మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఓ ఓ సూపర్ ఫైనల్‌గా నిలిచిపోయింది. అయితే ఈ మెగాటోర్నీలో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు తనకు ఆశ్చర్యం కలిగించాయని స్టోక్స్ తన బుక్‌లో రాసుకొచ్చాడు.

 అనూహ్యంగా ఓడిన భారత్..

అనూహ్యంగా ఓడిన భారత్..

టోర్నీలో అప్పటి వరకు ఓటమెరుగని జట్టుగా దూసుకుపోయిన కోహ్లీ సేనకు ఇంగ్లండ్ భారీ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్నీ బెయిర్‌స్టో (111) సెంచరీతో చెలరేగగా.. జాసన్ రాయ్(66), బెన్ స్టోక్స్ (79) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్.. రోహిత్(102) సెంచరీ, కోహ్లీ(66) హాఫ్ సెంచరీతో రాణించినా లక్ష్యాన్ని అందుకోలేక 31 పరుగులతో ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు మాత్రమే చేసింది.

చిన్న బౌండరీ వల్లే ఓడిపోయామన్న కోహ్లీ..

చిన్న బౌండరీ వల్లే ఓడిపోయామన్న కోహ్లీ..

ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. టాస్, చిన్న బౌండరీల వల్లనే ఓడిపోయామన్నాడు. ‘టాస్ కీలకమైంది. ముఖ్యంగా ఇలాంటి చిన్న బౌండరీలు ఉన్న మైదానాల్లో దాని ప్రభావం ఎక్కువ. ఈ తరహా మైదానాల్లో ఫ్లాట్ పిచ్‌లు ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం ఇదే తొలిసారి. బ్యాట్స్‌మన్ రివర్స్ స్వీప్‌తో సులువుగా సిక్స్‌లు కొట్టొచ్చు. ఎందుకంటే బౌండరీ 59 మీటర్ల దూరమే ఉంది. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇది చాలా సులభం. వారు ఇది గ్రహించి చాలా తెలివిగా ఆడారు. చిన్న బౌండరీ వైపు ఎక్కువగా ఆడుతూ పరుగులు పిండుకున్నారు'అని కోహ్లీ తెలిపాడు.

ఇదో చెత్త ఫిర్యాదు..

ఇదో చెత్త ఫిర్యాదు..

అయితే కోహ్లీ వ్యాఖ్యలపై తన బుక్‌లో స్టోక్స్ స్పందించాడు. ఇదో చెత్త ఫిర్యాదని తెలిపాడు. ‘పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో భారత కెప్టెన్ బౌండరీల సైజ్ గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి బిత్తిరి మాటలు నేనెప్పుడు వినలేదు. ఇదో చెత్త ఫిర్యాదు.'అని స్టోక్స్ తన బుక్‌లో కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఎడుస్తాననుకోలేదు..

ఎడుస్తాననుకోలేదు..

ఇక ప్రపంచకప్ విజయానంతరం భావోద్వేగానికి గురైన క్షణాలను కూడా స్టోక్స్ తన పుస్తకంలో రాసుకున్నాడు. ‘టోర్నీలో ఆస్ట్రేలియాతో ఓటమి మా అవకాశాలను సంక్లిష్టం చేసింది. దీంతో భారత్, న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనెప్పుడు మైదానంలో ఏడుస్తానని అనుకోలేదు. కానీ ఆ రోజు ఫైనల్లో రెండు, మూడు సార్లు, ఐదు నిమిషాల పాటు ఏడ్చాను.'అని నాటి భావోద్వేగ క్షణాలకు తన పుస్తకంలో స్టోక్స్ అక్షర రూపం ఇచ్చాడు.

నాటి ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీల లెక్క ఆదారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం వెల్లువెత్తిన విమర్శలతో ప్రస్తుతం ఆ నిబంధనను తొలగించారు.

వన్డే ప్రపంచకప్‌ ఓటమికి కోహ్లీసేన అనాలోచిత నిర్ణయాలే కారణం: యువరాజ్

Story first published: Tuesday, May 19, 2020, 15:04 [IST]
Other articles published on May 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X