న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘వివో’పై తొందరెందుకు.. చైనా కంపెనీ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐ

BCCI unlikely to cut ties with IPL title sponsor Vivo

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ అయిన చైనా కంపెనీ 'వివో'తో తెగదెంపులు చేసుకునే ఆలోచన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి లేనట్టు కనిపిస్తోంది. ఈ అంశంలో బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇందుకు బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులు, యాప్స్‌ను బహిష్కరించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతుంది.

యాప్స్ బ్యాన్‌తో..

యాప్స్ బ్యాన్‌తో..

ఈ నేపథ్యంలోనే దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59చైనీస్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ‘వివో'‌తో బీసీసీఐ తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ చైనా ఫోన్ల కంపెనీ స్పాన్సర్‌షిప్‌ లేకపోయినంత మాత్రాన బోర్డుకు వచ్చే పెద్ద నష్టమేమీ లేదని అభిమానులు అంటుండగా.. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ అంటుంది.

పాలకమండలి సమావేశమైతేనే...

పాలకమండలి సమావేశమైతేనే...

2020 ఐపీఎల్‌ సీజన్‌పై తేల్చాలన్నా... ‘వివో'ను వద్దనుకోవాలన్నా... అది మీడియా సమావేశంలో నిర్ణయించే తేలికైన అంశం కాదు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (జీసీ) భేటీలోనే తేలుతుంది. అప్పుడే సాధ్యాసాధ్యాలను చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇదే విషయాన్ని జీసీ సభ్యులు తెలిపారు. అయితే ఐపీఎల్‌ జీసీ మీటింగ్‌ జరగాలంటే టీ20 ప్రపంచకప్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఈ ఏడాది మెగా టోర్నీ నిర్వహణపై నిరాసక్తత వ్యక్తపరిచినా... అది ఐసీసీ ఈవెంట్‌ కాబట్టి ఐసీసీనే వెల్లడించాలి.

నష్టం లేకుంటనే..

నష్టం లేకుంటనే..

మనకు ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌ సహా, ఆసియా కప్‌పై ఎలాంటి సమాచారం లేదు. అలాంటపుడు దేని కోసం ఐపీఎల్‌ పాలక మండలి సమావేశమవుతుంది? ఒకవేళ ఆ టోర్నీలు లేకపోతేనే ఐపీఎల్‌పై ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ‘వివో'పై కూడా అప్పుడే చర్చించే వీలుంటుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే బోర్డుకు పోయేదేమీ లేదనుకుంటే తప్పకుండా పరిశీలిస్తుంది. కానీ బీసీసీఐనే పరిహారం చెల్లించాల్సిన ప్రతికూలాంశాలుంటే మాత్రం ఒప్పందం గడువు 2022 దాకా వేచి చూడాలి'అని ఆ అధికారి తెలిపారు.

ఒక్క ముంబైలోనే ఐపీఎల్‌ 2020

ఒక్క ముంబైలోనే ఐపీఎల్‌ 2020

ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగితే ఒక్క నగరానికే పరిమితం చేయాలని కొందరు బీసీసీఐ సీనియర్‌ అధికారులు జీసీ వర్గాలకు సూచించినట్లు తెలుస్తుంది. అది ముంబై అయితేనే సౌకర్యంగా ఉంటుందన్నారు. ‘ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు వాంఖెడే, బ్రబౌర్న్, డీవై పాటిల్‌ మైదానాలున్నాయి. దీంతోపాటు రిలయెన్స్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రత్యేకించి మైదానం ఉంది.

అలాగే స్టార్‌ హోటళ్లకు కొదవే లేదు. అయితే ఇదేమీ ఇప్పటి సూచన కాదు. మహారాష్ట్రలో వైరస్‌ సాధారణంగా ఉన్నపుడు చేసిన సూచన... కానీ ఇప్పుడైతే ముంబై పరిస్థితి ఘోరంగా ఉంది. అక్టోబర్‌కల్లా ముంబైలో వైరస్‌ నియంత్రణలోకి వస్తుందన్న ఆశలుంటేనే ఒకే వేదికపై ఐపీఎల్‌ నిర్వహించాలన్న సూచనను జీసీ పరిశీలిస్తుందని మరో అధికారి తెలిపారు.

ఏబీ డివిలియర్స్ ఆల్‌లైమ్ ఐపీఎల్ ఎలెవన్.. కెప్టెన్ కోహ్లీ కాదు!

Story first published: Thursday, July 2, 2020, 10:00 [IST]
Other articles published on Jul 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X