న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏబీ డివిలియర్స్ ఆల్‌లైమ్ ఐపీఎల్ ఎలెవన్.. కెప్టెన్ కోహ్లీ కాదు!

AB de Villiers names his all-star IPL XI, picks MS Dhoni as skipper and wicketkeeper

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దాదాపు మూడున్నర నెలలుగా క్రికెట్ టోర్నీలు జరగకపోవడంతో స్టార్ ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు లైవ్ సెషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలతో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

ఇక మ్యాచ్‌లు లేకపోవడంతో ఫాంటసీ క్రికెట్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు తమ ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్లను ప్రకటించారు. తాజాగా సౌతాఫ్రికా దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ ఆల్‌టైమ్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. క్రిక్‌బజ్ వేదికగా జరిగిన లైవ్ సెషన్‌లో ఈ అత్యుత్తమ ఐపీఎల్ జట్టును ప్రకటించిన డివిలియర్స్.. తన జట్టులో దాదాపు ఈ తరం ఆటగాళ్లనే తీసుకోవడం గమనార్హం.

డాషింగ్ ఓపెనర్లు

డాషింగ్ ఓపెనర్లు

క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్‌ నుంచి ఆడుతున్న ఏబీడీ.. ప్రారంభంలో వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని ఢిల్లీ డేర్‌‌డేవిల్స్‌కు ఆడాడు. ఈ నేపథ్యంలో అతనితో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ 360.. ఈ అత్యుత్తమ జట్టుకు ప్రధాన ఓపెనర్‌గా అతన్నే ఎంపిక చేశాడు. మరో ఓపెనర్‌గా భారత విధ్వంసకర ఆటగాడు రోహిత్ శర్మను తీసుకున్నాడు. ఇక ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కు ఐపీఎల్‌లో అమోఘమైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 188 మ్యా‌చ్‌లు ఆడిన రోహిత్.. 31.60 సగటుతో 4898 రన్స్ చేశాడు. ఆశ్చర్యకరంగా తన ఆర్సీబీ మాజీ సహచర ఆటగాడు, విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను ఏబీడీ విస్మరించాడు.

కోహ్లీకి జతగా తాను..

కోహ్లీకి జతగా తాను..

ఇక నిలకడకు మారుపేరైన తన ఫ్రాంచైజీ ఆర్సీబీ సారథి, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడో స్థానంలో ఎంపిక చేసిన డివిలియర్స్.. మిడిలార్డర్‌లో అతనికి జతగా నాలుగోస్థానంలో తన పేరును సూచించుకున్నాడు. ఇక ఆర్సీబీ తరఫున కోహ్లీ-ఏబీడీ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే.

కెప్టెన్‌గా ధోనీ..

కెప్టెన్‌గా ధోనీ..

ఇక తన సారథి కోహ్లీని కేవలం ఆటగాడిగా మాత్రమే పరిమితం చేసిన డివిలియర్స్... ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి తన ఆల్‌టైమ్ జట్టు పగ్గాలు అందించాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ బాధ్యతలతో పాటు.. ఫినిషర్ పాత్రను పోషించడానికి బ్యాటింగ్‌లో ఆరో స్థానాన్ని కేటాయించాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఇంగ్లండ్ వరల్డ్ కప్ హీరో బెన్‌స్టోక్స్.. భారత స్టార్ రవీంద్ర జడేజాలను తీసుకున్నాడు.

ముగ్గురు పేసర్లు..

ముగ్గురు పేసర్లు..

స్పిన్నర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్‌ను ఎంపిక చేసిన ఏబీడీ.. భువనేశ్వకుమార్, కగిసో రబడా, జస్‌ప్రీత్ బుమ్రాలతో పేస్ విభాగాన్ని పూర్తి చేశాడు. తన సహచర ఆటగాడు, సౌతాఫ్రికా పేసర్ రబడా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 18 మ్యాచ్‌ల్లోనే 31 వికెట్లు పడగొట్టాడు. ఇక బుమ్రా, భువనేశ్వర్ ఐపీఎల్ స్పెషలిస్ట్ బౌలర్లన్నది అందరికి తెలిసిందే.

ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఎలెవన్

ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఎలెవన్

వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడ, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Wednesday, July 1, 2020, 14:03 [IST]
Other articles published on Jul 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X