న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవకాశం వస్తే ఆ ముగ్గురితో సహా ధోనీని తీసుకుంటా: సౌరవ్ గంగూలీ

BCCI President Sourav Ganguly names three players from India’s 2019 World Cup squad he would pick in 2003 WC team

న్యూఢిల్లీ: బలబలాల విషయంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని 2003 ప్రపంచకప్ జట్టు.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని 2019 వరల్డ్‌కప్ టీమ్ సమానమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల సామర్థ్యాలు కూడా ఒకటేనని చెబుతుంటారు. ఇక గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అలాగే 2019లో విరాట్‌ కోహ్లీ జట్టు సెమీస్‌లో కివీస్‌తో విఫలమైంది. ఈ రెండు సార్లు టీమిండియా ఎంతో పటిష్టంగానే కనిపించినా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది.

 రోహిత్‌తో సహా..

రోహిత్‌తో సహా..

ఇదిలా ఉండగా, మాజీ కెప్టెన్ గంగూలీ తాజాగా మయాంక్‌ అగర్వాల్‌తో ‘దాదా ఓపెన్స్ విత్ మయాంక్'షోలో చిట్‌చాట్ చేశాడు.. ఈ సందర్భంగా ఓ అభిమాని దాదాను ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. 2019 ప్రపంచకప్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లని 2003 నాటి ప్రపంచకప్‌ టీమ్‌లోకి తీసుకోవాల్సి వస్తే ఎవరిని తీసుకుంటావని ప్రశ్నించారు. దానికి స్పందించిన గంగూలీ.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సహా ఓపెనర్‌ రోహిత్‌శర్మ, ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రాను ఎంచుకున్నాడు.

కారణం అదే..

కారణం అదే..

అనంతరం వారిని తీసుకునేందుకు గల కారణాలను దాదా వివరించాడు. బుమ్రా ఫాస్ట్‌బౌలింగ్‌లో నాణ్యమైన బౌలర్‌ అని అందుకే అతడిని తీసుకుంటానని చెప్పాడు. పైగా తాము ఆడింది పేస్‌కు అనుకూలించే సౌతాఫ్రికాలోనని, మేం కూడా బాగానే బౌలింగ్ చేశామన్నాడు. అలాగే రోహిత్‌ను టాప్‌ ఆర్డర్‌లో పంపుతానన్నాడు. ఎందుకంటే గతేడాది ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌ ఐదు శతకాలతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక తాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతానని తర్వాత కోహ్లీని పంపుతానని చెప్పాడు.

సెహ్వాగ్ చంపేస్తాడే మో..

సెహ్వాగ్ చంపేస్తాడే మో..

ఈ సందర్భంగా గంగూలీ జోక్‌ చేస్తూ.. ఈ వీడియోను చూసి సెహ్వాగ్‌ తనకు ఫోన్‌ చేస్తాడేమోనని చమత్కరించాడు. ఇక ఈ ముగ్గుర్ని కాకుండా నాలుగో అవకాశం ఇస్తే ధోనీని కూడా తీసుకుంటానన్నాడు. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌ను కీపర్‌గా కొనసాగిస్తానని, 2003లో అతను బాగా కీపింగ్‌ చేశాడని దాదా గుర్తుచేసుకున్నాడు. కాగా, ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇక ఈ వీడియోపై అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 ఫైనల్లో చిత్తుగా..

ఫైనల్లో చిత్తుగా..

2003 ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం అదరగొట్టిన గంగూలీసేన.. ఒక్క ఆస్ట్రేలియా దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయింది. లీగ్ మ్యాచ్‌లో అదే జట్టు చేతిలో ఓడిన భారత్.. ఫైనల్లో మరోసారి ఖంగుతిన్నది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. విధ్వంసకర ఆటతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 359 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్య చేధనకు దిగిన భారత్‌ 234 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెహ్వాగ్ (82) ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. ఇక 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ పోరులో ఇదే సీన్ రీపిట్ అయింది. కివీస్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత్ విజయం ముంగిట బొక్కబోర్లాపడింది.

ఐపీఎల్‌తో వచ్చే డబ్బు మా జేబుల్లోకి ఏం రాదు.. విమర్శకులపై బీసీసీఐ ట్రెజరర్ ఫైర్!

Story first published: Sunday, July 5, 2020, 20:04 [IST]
Other articles published on Jul 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X