న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌తో వచ్చే డబ్బు మా జేబుల్లోకి ఏం రాదు.. విమర్శకులపై బీసీసీఐ ట్రెజరర్ ఫైర్!

BCCI treasurer Arun Dhumal Says Money goes to players not to Sourav Ganguly or Jay Shah

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణపై వస్తున్న విమర్శలపై భారత క్రికెట్ నియంత్ర మండలి(బీసీసీఐ) ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్ టోర్నీతో వచ్చే సొమ్ము సౌరవ్ గంగూలీ, జైషా, ధూమాల్ జేబుల్లోకి ఏమి రాదని మండిపడ్డాడు. ఆ డబ్బు ఆటగాళ్లతో పాటు దేశ సంక్షేమానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశాడు. పన్నుల రూపంలో బీసీసీఐ వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లిస్తుందని, అంతేకాకుండా ఈ మెగాటోర్నీ నిర్వహణ ద్వారా టూరీజం, ట్రావెల్ ఇండస్ట్రీలకు లాభం చేకూరుతుందని స్పష్టం చేశాడు.

ప్రాణాలతో చెలగాటమా..?

ప్రాణాలతో చెలగాటమా..?

ఓవైపు కరోనాతో యావత్ దేశ ప్రజలు అల్లాడుతుంటే.. మరో వైపు డబ్బుల కోసం బీసీసీఐ ఐపీఎల్ పేరిట ప్రజలు, ఆటగాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వినిపించాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధుమాల్ ఆదివారం మీడియా వేదికగా విమర్శకుల దుమ్ముదులిపాడు. అంతేకాకుండా ఆటగాళ్లు సురక్షితంగా ఉండే పరిస్థితులుంటేనే ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుందని స్పష్టం చేశాడు.

ట్రావెల్, టూరీజం ఇండస్ట్రీలకు ఊతం..

ట్రావెల్, టూరీజం ఇండస్ట్రీలకు ఊతం..

‘ప్రతీ ఒక్కరు ఐపీఎల్ డబ్బులను ఉత్పత్తి చేసే యంత్రంలా మాట్లాడుతున్నారు. మరీ ఈ డబ్బంతా ఎవరు తీసుకుంటున్నారు? ఇదంతా ఆటగాళ్లకు, దేశ క్షేమానికే ఉపయోగపడుతుంది తప్పా.. ఆఫిస్ బేరర్లు జేబుల్లోకి వెళ్లదనే విషయాన్ని గ్రహించాలి. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా ట్రావెల్, టూరీజం ఇండస్ట్రీలకు లాభం చేకూరుతుంది. తద్వారా దేశానికి పన్నుల రూపంలో డబ్బు వస్తుంది.'అని క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ధుమాల్ తెలిపాడు.

దేశ అభివృద్ధికే కదా..

దేశ అభివృద్ధికే కదా..

ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్న ఈ డబ్బును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ధుమాల్ ప్రశ్నించాడు. మీడియా తనవైఖరిని మార్చుకోవాలని కూడా సూచించాడు. ‘టోర్నీలో ఆడే ఆటగాళ్లతో పాటు, నిర్వాహకులు, లీగ్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికి ఈ డబ్బు అందుతుంది. మీడియా తన వైఖరి మార్చుకోవాలి. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా జరిగే ప్రయోజనాన్ని చెప్పాలి.

ఒక వేళ బీసీసీఐ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను చెల్లిస్తే.. అది దేశ అభివృద్ధికే ఉపయోగపడుతుంది తప్పా.. సౌరవ్ గంగూలీ, జైషా, ధుమాల్ జేబుల్లోకి వెళ్లదు కదా. కాబట్టి క్రీడలకు ఖర్చు చేయడం కంటే డబ్బు జనరేట్ అవుతుందనే విషయాన్ని గ్రహించి సంతోషపడాలి'అని ధుమాల్ మీడియాకు సూచించాడు.

సురక్షిత పరిస్థితులు ఉంటేనే..?

సురక్షిత పరిస్థితులు ఉంటేనే..?

‘మైదానాలకు ఆటగాళ్లు వెళ్లే సురక్షిత పరిస్థితులు ఉంటేనే టోర్నీ నిర్వహణపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాం. బీసీసీఐ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడటమే. అంతే కానీ ఇప్పటి వరకు ఏ టోర్నీ గురించి కూడా మేం మాట్లాడలేదు. ప్రకటన చేయలేదు. మేం చెప్పేది ఒక్కటే.. ఆటగాళ్లు ఆడేందుకు సురక్షిత పరిస్థితులు ఉంటేనే టోర్నీ నిర్వహిస్తాం. ఆటగాళ్ల భద్రతా, ఆరోగ్యం విషయంలో ఏమాత్రం రాజీపడం. సురక్షిత పరిస్థితులు ఉంటేనే ఐపీఎల్ జరుగుతుంది'అని ధుమాల్ స్పష్టం చేశాడు.

ఆ ఒక్క విషయంలో గంగూలీ అంటేనే అసహ్యం కలిగేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Story first published: Sunday, July 5, 2020, 18:23 [IST]
Other articles published on Jul 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X