న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కూతురి కోసం డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌.!!

Australia Cricketer David Warner debuts on TikTok after request from his 5-year-old daughter

మెల్‌‌బోర్న్: కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం అతలా కుతలం అవుతుండగా.. క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి యావత్ దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. ఇండోర్ గేమ్స్ ఆడుతూ.. సోషల్ మీడియా వేదికగా ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండటం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారు చేసే చిలిపి పనులను షేర్ చేస్తున్నారు.

టిక్‌టాక్‌లోకి వార్నర్..

టిక్‌టాక్‌లోకి వార్నర్..

ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా సోషల్ మీడియా‌లో చురుకుగా ఉంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటి వరకు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగానే అప్‌డేట్స్ ఇచ్చిన వార్నర్ తాజాగా టిక్‌టాక్‌లోకి అరంగేట్రం చేశాడు

కూతురు కోరిక మేరకు

ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ మంగళవారం ఓ టిక్‌టాక్ వీడియోను షేర్ చేస్తూ.. తనకు ఈ యాప్ పట్ల ఎలాంటి అవగాహన లేదని తెలిపాడు. తన ఐదేళ్ల కూతురు ఇవీమే కోరిక మేరకు టిక్‌టాక్‌లోకి వచ్చినట్లు తెలిపాడు. ఇప్పటికీ తనకు ఫాలోవర్లు లేరని.. సాయం చేయాలని కోరాడు. ఇక ఈ టిక్‌టాక్‌ వీడియోలో తన ఇద్దరు కూతుళ్లు ఇవిమే, ఇండి రే‌లతో ఫేవరేట్ సాంగ్ ‘నెవర్ సీన్ ద రైన్'కు లిప్ సింక్ ఇచ్చాడు.

జడేజాను అనుకరిస్తూ..

జడేజాను అనుకరిస్తూ..

ఇటీవల టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘బ్యాట్‌సాము'ను అనుకరించిన ఓ త్రో బ్యాక్ వీడియోను వార్నర్ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.‘గ‌తేడాది ఇదే స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున వాణిజ్య కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ క‌త్తిసాము (బ్యాట్‌సాము) చేశాను. ఇది జ‌డేజాలానే ఉందా ఓసారి చెప్పండి'అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు. అయితే ఈ వీడియోను చూసిన జడ్డూ.. దాదాపు తనలానే ఉందంటూ డేవిడ్ మెచ్చుకున్నాడు.

వైద్య‌ సిబ్బందికి మ‌ద్ద‌తుగా గుండు..

వైద్య‌ సిబ్బందికి మ‌ద్ద‌తుగా గుండు..

క్ష‌ణం తీరిక‌లేకుండా ప్ర‌జ‌ల రక్షణ కోసం త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాడుతున్న వైద్య‌, పోలీస్ సిబ్బందికి సంఘీభావంగా డేవిడ్ వార్న‌ర్ గుండు చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లోనే ట్రిమ్మర్ సాయంతో వార్నర్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. కరోనాను స‌మ‌ర్థంగా నిలువ‌రించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారికి ఇది నా మ‌ద్ద‌తు అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.

'క‌రోనాపై పోరాడుతున్న వారికి మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ఇలా త‌ల వెంట్రుక‌లు షేవ్ చేసుకున్నా. నాలాగా చేయాలని విరాట్‌, స్మిత్‌ను నామినెట్ చేస్తున్నా' అని వార్న‌ర్ త‌న ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

యూవీ ఫౌండేషన్‌కు విరాళమిస్తే.. మా దేశంలో నన్నెవరూ ప్రశ్నించలేదు: అఫ్రిది

Story first published: Tuesday, April 14, 2020, 18:46 [IST]
Other articles published on Apr 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X