న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కన్నా రిషభ్ పంతే ప్రతిభావంతుడు: ఆశిష్ నెహ్రా

Ashish Nehra Says Rishabh Pant Has A More Natural Talent Than MS Dhoni

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నా పంతే సహజమైన ప్రతిభకలిగి ఉన్నాడని కొనియాడాడు. మహీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికే ఉందని అభిప్రాయపడ్డాడు. శనివారం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీతో గడిపిన క్షణాలను నెమరవేసుకున్న నెహ్రా.. అతని వారుసుడు రిషభ్ పంతేనని జోస్యం చెప్పాడు.

 కుర్ర ధోనీ కన్నా..

కుర్ర ధోనీ కన్నా..

23 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ కన్నా 22 ఏళ్ల పంత్‌లో పరిపక్వత, సహజమైన ప్రతిభ ఎక్కువుందన్నాడు. అలానే పంత్ మరింత మెరుగై ధోనీలా ధృడంగా నిలబడితే.. భారత క్రికెట్‌లో మహీ స్థానాన్ని భర్తీ చేస్తాడన్నాడు. ‘రిషభ్ పంత్‌ను అతని 14 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నా. చబ్బీ కిడ్. 2004లో 23 ఏళ్ల వయసులో క్రికెట్‌లో అడుగుపెట్టిన ధోనీ కన్నా పంత్‌లో సహజ నైపుణ్యం ఎక్కువ. కానీ పంత్ మహీలా ధైర్యంగా నిలబడతాడా..? ధోనీ స్థానాన్ని భర్తీ చేయగలడా అనేది అతనే నిరూపించుకుంటాడు'అని నెహ్రా విశ్వాసం వ్యక్తం చేశాడు.

 సీనియర్లకు గౌరవం ఇచ్చేవాడు..

సీనియర్లకు గౌరవం ఇచ్చేవాడు..

ఇక ధోనీ గురించి మాట్లాడుతూ.. సీనియర్లకు అతను చాలా మర్యాద ఇచ్చేవాడని, అంతేస్థాయిలో వారి నుంచి గౌరవం పొందేవాడన్నాడు. ఇతరుల మనస్థత్వాలు అర్ధం చేసుకోవడంలో మహీకి సాటిలేరని ప్రశంసించాడు. ‘ధోనీ సీనియర్ ఆటగాళ్లందరి పట్ల ఎంతో గౌరవం కలిగి ఉండేవాడు. వారికి కావాల్సిన స్పేస్‌ను ఇచ్చేవాడు. అతనికున్న మైండ్ రీడింగ్ సామర్థ్యంతోనే ఇదంతా సాధ్యమైందనదే నా అంచనా. అతను మర్యాధ ఇచ్చేవాడు అంతే స్థాయిలో గౌరవాన్ని పొందేవాడు. ఏనాడు కూడా తాను అనుకుంటున్న విషయాలను ఆటగాళ్లపై రుద్దే ప్రయత్నం చేయలేదు. ఆటగాళ్ల అభిరుచి తగ్గట్లే వ్యూహాలు రచించేవాడు. వారిలో ప్రతిభను ముందే పసిగట్టేవాడు. మైండ్ రీడింగ్ సామర్థ్యమే అతన్ని ఓ గొప్ప సారథిగా నిలబెట్టింది'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

ధోనీ ఓ మోసగాడు.. మమ్మల్ని నట్టేట ముంచేసాడు: ఆమ్రపాలి బాధితులు

నిర్లక్ష్యమైన ఆట తీరుతో..

నిర్లక్ష్యమైన ఆట తీరుతో..

ఇక ధోనీ వారసుడిలా ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్, కీపింగ్‌లోనూ తడబడ్డాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే నిర్లక్ష్యపు షాట్లు ఆడుతూ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అతని స్థానంలో వికెట్ కీపింగ్ చేసిన కేఎల్ రాహుల్ సూపర్ సక్సెస్ కావడంతో పంత్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అటు టెస్ట్‌ల్లో కూడా సూపర్ వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్న వృద్దిమాన్ సాహాతో గట్టి పోటీ నెలకొంది. ధోనీ రిటైర్మెంట్‌తో సంజూ శాంసన్ కూడా రేసులోకి వచ్చాడు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువ వికెట్ కీపర్లు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంత్ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.

బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!

Story first published: Wednesday, August 19, 2020, 13:13 [IST]
Other articles published on Aug 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X