For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!

Dhoni fans emotional message to MSD

డియర్ మహేంద్ర సింగ్ ధోనీ.. నీ ఆకస్మిక నిర్ణయం బాలేదు. ఏ మాత్రం నచ్చలేదు.. నిన్ననే కదా ఐపీఎల్ కోసమని చెన్నైకి వచ్చి మా అందర్నీ ఆనందపరిచింది. అంతలోనే ఏమైంది నీకు.. మమ్మల్ని ఇంతలా బాధపెట్టే నిర్ణయాన్ని వెల్లడించావ్! ఓవైపు ఏడాదిగా నీ రాక కోసం ఎదురూ చూస్తూ ఈ ఐపీఎల్‌లో నీ ఆటను ఆస్వాదిద్దామనకున్న మాకు ఇంత షాకివ్వడం నీకు సమంజసమా..? నీ రిటైర్మెంట్‌పై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నా.. మౌనంగా ఉన్న నీవు ఎందుకీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నావ్.! అసత్యవార్తలు ప్రచారం చేసిన ఆకతాయిలపై వదినమ్మ విరుచుకపడటం మాకు కొండంత అండనిచ్చింది! కానీ నీవు మాత్రం వాటన్నిటిని నిజం చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించడం.. మా గుండెలను పిండేస్తోంది.

మ్యాచ్‌లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు మమ్మల్ని మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్‌తో గెలిపించడం నీకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయాలు తీసుకోవడం నీకు అలవాటైన ఆట. అనూహ్య ఆలోచనలు, వ్యూహాలు నీకు కొత్త కాదు. మమ్మల్ని అలరిస్తూ అరుదైన విజయాలు అందించినా... అవమానకర పరాజయాల్లో కూడా అదే నిగ్రహాన్ని ప్రదర్శించినా అది నీకే చెల్లింది. కొందరి దృష్టిలో నీవో అద్భుతమైతే మరికొందరి దృష్టిలో నీవో సుడిగాడివి మాత్రమే. అయితే ఎవరేమనుకున్నా భారత క్రికెట్‌లో మా దృష్టిలో మాత్రం నీవో ఒక అద్భుతం.

జులపాల జుట్టుతో పాక్‌ బౌలర్లను నీవు చీల్చి చెండాడిన విధానం ఇంకా మా కళ్ల ముందే కదలాడుతోంది. కుర్రాళ్లతో దక్షిణాఫ్రికాకు వెళ్లి నీవు తెచ్చిన తొలి టీ20 ప్రపంచకప్‌.. సొంతగడ్డ మీద శ్రీలంకపై ఫైనల్లో 91 నాటౌట్‌తో చెలరేగి 28 ఏళ్ల కలను సాకారం చేసిన క్షణం మా మదిలో నిలిచిపోయింది.

నీ 'మహి'మలు ఒకటా రెండా.. అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టేసినా.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసినా.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసినా.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేసినా.. సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా అది నీకే చెల్లింది.

అంతేనా.. కుర్రాళ్ల ఆటగా ముద్రపడ్డ ఐపీఎల్‌లో 'డ్యాడ్స్ ఆర్మీ'తో మూడుసార్లు టైటిల్ కొట్టి లీగ్‌లో చెన్నైని మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌గా మార్చేసినా.. ఎంతో మంది కుర్రాళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దినా.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత్‌కు చిరస్మరణీ విజయాలు అందించినా.. అది నీకే సాధ్యమైంది. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో రనౌటై భారత్‌ను గెలిపించలేకపోయిన బాధలో నీ కంట వచ్చిన కన్నీరు మమ్మల్ని కదిలించింది. తర్వాత ఆటకు దూరమై ఆర్మీలో చేరితే నీ ఫ్యాన్స్‌గా మేం గర్వపడ్డాం.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అందుకొని సచిన్ టెండూల్కర్ తరహాలో ఆటకు సగర్వంగా నీకు వీడ్కోలు పలకాలని కలలు కన్నాం. కానీ నీ ఈ నిర్ణయం మా కలలను కల్లలు చేసింది.
కనీసం ఆ ఐపీఎల్ అయిన కొన్నేళ్లు ఆడు మహీ! - మైఖేల్ తెలుగు

Story first published: Saturday, August 15, 2020, 22:12 [IST]
Other articles published on Aug 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+