ధోనీ ఓ మోసగాడు.. మమ్మల్ని నట్టేట ముంచేసాడు: ఆమ్రపాలి బాధితులు

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ నిర్ణయంతో యావత్ క్రికెట్‌లోకం షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా ధోనీ సాధించిన విజయాలు, ఘనతలు, చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు నెమరవేసుకుంటున్నారు. ధోనీతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. దీంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా ధోనీ పేరు దద్దరిల్లుతోంది.
అతని పేరుమీద హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు కొందరు ఔత్సాహికులు ధోనీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఇదంతా ఒకవైపు జరుగుతుండగా మరోవైపు ధోనీ చేతిలో తాము మోసపోయామని, అతన్ని చూసి ఇళ్లు కొనుక్కొని నట్టేట మునిగామని ఆమ్రపాలి గ్రూప్ బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రపంచమంతా అనుకుంటున్నంత మంచివాడు ధోనీ కాదని, అతని చీకటి కోణాలు, దందాలు వేరేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కుట్రలో ధోనీ భాగమే..
‘క్రికెటర్‌గా ధోనీకి, బిల్డర్‌గా అనిల్ శర్మకు దేశంలో ఎంతో పేరుంది. ఈ ఇద్దరిపై ఉన్న నమ్మకంతోనే ఆమ్రపాలిలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించాం. నేరపూరిత కుట్రలో ధోనీ కూడా భాగమే. ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరును కూడా చేర్చాం' అని ఆమ్రపాలి బిల్డర్స్ చేతిలో మోసపోయిన బాధితుల్లో ఒకరైన జితేందర్ కుమార్ తాజాగా మీడియాకు తెలిపారు. ఇక జితేందరే కాకుండా ఇతర బాధితులు కూడా ఆ సంస్థకు ధోనీ అంబాసిడర్ కావడంతోనే ఇళ్లను కొనుగోలు చేశామని, ఆమ్రపాలి గ్రూప్‌తో ధోనీ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.

ధోనీ సతీమణి సాక్షి సింగ్‌కు వాటా..
ఆమ్రపాలి గ్రూప్ ఇళ్లు కట్టిస్తామని వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి, ఆ డబ్బును ఫేక్ కంపెనీలకు డైవర్ట్ చేసింది. ఈ స్కామ్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ గ్రూప్ ఆర్థికలావాదేవిల మీద సుప్రీం ఆడిటింగ్ కూడా చేయించింది. ఈ ఆడిటింగ్‌లో ఈ కంపెనీ మోసాలు చాలా బయటపడ్డాయి. ఈ గ్రూప్ అనేక కంపేనీలను క్రియేట్ చేసి, వేల కోట్లను మళ్లించిందని, అందులో ఆమ్రపాలి మహిడెవలపర్స్ ఒకటని ఆ ఆడిటింగ్‌లో తెలిసింది. ఇందులో ధోనీ భార్య సాక్షి సింగ్ పేరిట 25 శాతం వాటా ఉందని వెల్లడైంది.

రితి స్పోర్ట్స్‌తో ఆమ్రపాలి చీకటి ఒప్పందాలు
అలాగే ఆమ్రపాలి గ్రూప్‌కు రితి స్పోర్ట్స్ మెనేజ్‌మెంట్ అనే కంపెనీ మధ్య కూడా ఈ చీకటి లావాదేవిలు జరగాయని సుప్రీం నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు తేల్చారు.
హోమ్ బయ్యర్స్ డబ్బును ఆమ్రపాలి గ్రూప్.. ఇల్లీగల్‌గా ధోనీకి చెందిన ఈ స్పోర్ట్స్ కంపెనీకి డైవర్ట్ చేసిందని తెలిపారు. రితి స్పోర్ట్స్ మెనేజ్‌మెంట్ అనే కంపెనీ ధోనీకి సంబంధించిన బ్రాండ్లకు ప్రచారం కల్పిస్తుంటుంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చెన్నైసూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సంబంధించిన కంపెనీకి, ఆమ్రాపాలి గ్రూప్ మధ్య కూడా లావాదేవీలు జరగాయని ప్రొఫెషనల్ ఆడిటర్లు సుప్రీంకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.

నాకే రూ.40 కోట్లు ఇవ్వాలి..
ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఈ స్కాం బయటకొస్తున్నప్పుడు బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి వైదొలిగాడు. పైగా ఆరేళ్లు తన సర్వీసెస్ వాడుకున్నందుకు తనకే ఆ గ్రూప్ 40 కోట్లు బాకీ ఉందనీ, తనకే డబ్బురావాలని సుప్రీంను ఆశ్రయించాడు. అయితే ధోనీ కోర్టుకెక్కడంపై దిగ్విజయ్ సింగ్ అనే బాధితుడు అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘బిల్డర్స్ నుంచి డబ్బురావాలని ధోనీ కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. జరిగిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ ధోనీ ఎండార్స్‌మెంట్ ఫీజుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి. ప్రజలను మోసం చేసిన డబ్బులకు ధోనీ ఆశపడటం సిగ్గు చేటు'అని సదరు బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!