న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ తొలి టెస్టులోనే బర్న్స్‌ సెంచరీ: గత 100 టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఇది ఐదోది

Ashes 2019, Edgbaston Test, Day 2 Highlights: Burns unbeaten century underpins strong day for England

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రోరీ బర్న్స్‌ (125) అజేయ సెంచరీకి తోడు కెప్టెన్‌ రూట్‌ హాఫ్ సెంచరీ (57) తోడవడంతో ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లాండ్ ఇంకా 17 పరుగుల దూరంలో నిలిచింది.

ప్రస్తుతం క్రీజులో రోరీ బర్న్స్‌(125), బెన్ స్టోక్స్(38) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ జేసన్ రాయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బర్న్స్ ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బర్న్స్‌‌కు ఇదే తొలి యాషెస్‌ టెస్ట్‌. యాషెస్‌లో ఆడుతోన్న తొలి టెస్టులోనే బర్న్స్ సెంచరీ సాధించాడు. గత 100 టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు చేసిన ఐదో సెంచరీ ఇది.

'క్షమాపణలు' చెప్పిన జిమ్మీ..: గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే టోర్నీకే దూరం!!'క్షమాపణలు' చెప్పిన జిమ్మీ..: గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే టోర్నీకే దూరం!!

పేస్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడిన రాయ్

కాగా, ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడిన జేసన్‌ రాయ్‌.. ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయాడు. జట్టు స్కోరు 22 పరుగుల స్కోరు వద్ద ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్ జేసన్ రాయ్(10)ను ప్యాటిన్సన్ తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

అరరే ఎంతపని జరిగింది! టెక్నికల్ పాయింట్‌తో తెలుగు టైటాన్స్‌కు దక్కని గెలుపు

తొమ్మిది పరుగుల వద్ద జో రూట్‌కు లైఫ్

తొమ్మిది పరుగుల వద్ద జో రూట్‌కు లైఫ్

అయితే, నాథన్ లియాన్ వేసిన మొదటి ఓవర్‌ తొలి బంతి గింగరాలు తిరుగుతూ దాదాపు వికెట్‌ను గిరాటేసినంత పని చేసింది. జో రూట్‌ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌ పట్టడంతో అవుటైనట్టు అంపైర్‌ ప్రకటించాడు. అయితే రివ్యూకి వెళ్లిన జో రూట్ నాటౌట్‌గా బయటపడ్డాడు. బంతి బ్యాటును తాకలేదని స్నికోమీటర్‌ తేల్చింది.

బంతి బెయిల్స్‌ను తాకడంతో

బంతి బెయిల్స్‌ను తాకడంతో

మరి ఆ శబ్దం ఎక్కడిదన్న అనుమానం ఆటగాళ్లకు వచ్చింది. గంటకు 86 మైళ్ల వేగంతో ప్యాటిన్సన్‌ విసిరిన బంతి బెయిల్స్‌ను తాకడంతో ఆ శబ్దం వచ్చిందని ఫుటేజ్‌లో తేలింది. అంతవేగంగా వచ్చి తాకడంతో వికెట్లు కూడా ఊగాయి. కానీ ఒక్క బెయిల్‌ కూడా కింద పడకపోవడంతో ఆసీస్‌ ఆటగాళ్లు అవాక్కయ్యారు. అంపైర్‌‌కు తమ నిరసన తెలిపారు.

ఇంగ్లాండ్‌కు ఊహించని దెబ్బ: గాయంతో యాషెస్ మొత్తానికి దూరం!

బెయిల్స్‌ను మార్చాలని అంపైర్‌ను కోరిన టిమ్ పైన్

బెయిల్స్‌ను మార్చాలని అంపైర్‌ను కోరిన టిమ్ పైన్

బౌలర్ ప్యాటిన్సన్‌తోపాటు ఆసీస్‌ కెప్టెన్‌ టీమ్ పైన్ కూడా బెయిల్స్‌ను మార్చాలని అంపైర్‌ను కోరినా అతడు నిరాకరించాడు. అనంతరం 110 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న బర్స్న్‌కు జో రూట్ చక్కని సహకారం అందించాడు. రెండు లైఫ్‌ల తర్వాత కుదురుకున్న కెప్టెన్ జో రూట్‌ కూడా జోరు పెంచి కమిన్స్‌ ఓవర్లో బౌండరీతో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.

ఆస్ట్రేలియా 284 ఆలౌట్

ఆస్ట్రేలియా 284 ఆలౌట్

ఆ తర్వాత కొద్దిసేపటికే రూట్‌ను సిడిల్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపడంతో రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో డేన్లీ(18), బట్లర్(5) నిరాశపరిచారు. వీరిద్దరూ ఐదు పరుగుల తేడాతో పెవిలియన్‌కు చేరారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 284 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్(144) సెంచరీ సాధించాడు.

Story first published: Saturday, August 3, 2019, 8:56 [IST]
Other articles published on Aug 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X