న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌కు ఊహించని దెబ్బ: గాయంతో యాషెస్ మొత్తానికి దూరం!

England pacer Mark Wood ruled out of Ashes 2019 due to side strain

హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్ ప్రారంభమైన రెండో రోజే ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు పేసర్ మార్క్ వుడ్ పక్కటెముకల గాయంతో మొత్తం యాషెస్ సిరీస్‌కే దూరమయ్యాడు.

లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయంలో మార్క్ వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో పక్కటెముకల బాధతోనే బౌలింగ్‌ చేశాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా మార్క్‌వుడ్ నిలిచాడు.

విండిస్ పర్యటన షురూ: Ist T20I: మ్యాచ్ టైమింగ్, ఎక్కడ చూడాలివిండిస్ పర్యటన షురూ: Ist T20I: మ్యాచ్ టైమింగ్, ఎక్కడ చూడాలి

వరల్డ్‌కప్‌లో 18 వికెట్లు తీసిన మార్క్ వుడ్

వరల్డ్‌కప్‌లో 18 వికెట్లు తీసిన మార్క్ వుడ్

29 ఏళ్ల మార్క్ వుడ్ వరల్డ్‌కప్‌లో మొత్తం 18 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని మార్క్ వుడ్‌ను ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో సెలక్టర్లు చోటు కల్పించారు. అయితే, తొలి టెస్టులో ఆడే అవకాశం మాత్రం మార్క్ వుడ్ దక్కలేదు. అయితే, గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఇప్పుడు మొత్తం యాషెస్‌ సిరీస్‌‌కే దూరమయ్యాడు.

గాయం కారణంగా యాషెస్‌కు దూరం

గాయం కారణంగా యాషెస్‌కు దూరం

గాయం కారణంగా యాషెస్‌కు దూరమైన రెండో బౌలర్‌గా మార్క్ వుడ్ నిలిచాడు. ఎడ్జిబాస్టన్ వేదికగా తొలి టెస్టు మొదటి రోజు ఆట మధ్యలోనే ఇంగ్లాండ్‌ ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కాలిపిక్క గాయంతో అర్థాంతరంగా వైదొలగిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసిన అండర్సన్‌ పెవిలియన్‌ వీడాడు.

టెస్టు జెర్సీలపై పేర్లు, నంబర్లు చెత్తగా ఉన్నాయి: ట్విట్టర్‌లో గిల్లీ

ఆండర్సన్ అనుమానమే

దీంతో అతడికి స్కానింగ్‌లు నిర్వహించగా కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో యాషెస్‌ సిరీస్‌లో అండర్సన్‌ ఆడటం అనుమానంగానే ఉంది. ఇప్పుడు మార్క్ వుడ్ సైతం గాయం కారణంగా యాషెస్ మొత్తానికి దూరం కావడంతో ఇంగ్లాండ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

కేవలం 13 టెస్టులే ఆడిన మార్క్ వుడ్

కేవలం 13 టెస్టులే ఆడిన మార్క్ వుడ్

ఇదిలా ఉంటే, 2015లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన మార్క్‌ వుడ్‌ తరచూ గాయాల బారిన పడుతున్నాడు. దీంతో ఇప్పటివరకు అతడు కేవలం 13 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక, యాషెస్ టెస్టులో రెండో రోజైన శుక్రవారం ఆట ప్రారంభమైంది. ప్రస్తుతం 33 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.

విభేదాల మధ్య విండిస్ పర్యటన: ఫ్లోరిడాలో రోహిత్‌పై కోహ్లీ పైచేయి సాధించేనా?

ఓపెనర్ జేసన్ రాయ్ ఔట్

రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే ఓపెనర్ జేసన్ రాయ్ 10 పరుగుల వద్ద జేమ్స్ ప్యాటిన్సన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం జో రూట్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఓపెనర్ రోరీ బర్న్స్(53) హాఫ్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ జో రూట్(16) పరుగులతో ఉన్నాడు.

Story first published: Friday, August 2, 2019, 18:45 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X