న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ రీ ఎంట్రీకి సౌతాఫ్రికా కోచ్ డెడ్‌లైన్..!!

AB de Villiers gets a deadline for his international comeback from Mark Boucher

సెంచూరియన్‌: అనూహ్య నిర్ణయంతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన సౌతాఫ్రికా లెజండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీ ఎంట్రీ‌కి మార్గమం సుగుమం అయినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే మిస్టర్ 360 టీ20 ప్రపంచకప్‌తో ఆడనున్నాడు. ఏబీ జట్టులోకి రావాలనుకుంటే రావచ్చని, తమకెలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మిస్టర్ 360 ఆగయా..?

మిస్టర్ 360 ఆగయా..?

ఇక డివిలియర్స్ కూడా పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొని అదరగొట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్‌కు సమాయాత్తం అవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డివిలియర్స్ టోర్నీలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మార్క్ బౌచర్ చేసిన వ్యాఖ్యలు డివిలియర్స్ అభిమానులను ఆనంద డొలికల్లో ముంచెత్తుతున్నాయి.

సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటే?

సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటే?

సౌతాఫ్రికా జట్టులో ఆడాలనుకునే క్రికెటర్లు.. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత జూన్‌లో టీమ్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని మార్క్ బౌచర్ తాజాగా ప్రకటించాడు. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. మే 24న ఫైనల్‌ జరగనుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ టోర్నీ కోసం జూన్ నుంచి సఫారీ సన్నాహకాలు మొదలవుతాయని బౌచర్ వెల్లడించాడు.

ఐపీఎల్ 2020 తర్వాత జూన్‌లో శ్రీలంకతో దక్షిణాఫ్రికా సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆడే క్రికెటర్లే దాదాపు టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటారని బౌచర్ స్పష్టం చేశారు. టీమ్‌లోకి ఎంపికవకపోయినా. సెలక్షన్‌‌కు వచ్చిన క్రికెటర్లను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు జట్టును ప్రకటించే సమయానికి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని డివిలియర్స్‌కు కోచ్ పరోక్షంగా సూచించాడు.

భారత్‌కు వచ్చినప్పుడు.. తానేంటో చూపిస్తానన్న కోహ్లీని చూస్తే నవ్వొస్తుంది : ఆసీస్ పేసర్

అనాలోచిత నిర్ణయం..

అనాలోచిత నిర్ణయం..

2018 ఐపీఎల్ సీజన్ తర్వాత స్వదేశానికి వెళ్లిన డివిలియర్స్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట మనసు మార్చుకున్న ఈ లెజండరీ క్రికెటర్ రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైందని, జట్టు ప్రణాళికలు, సన్నాహకాలు మొదలయ్యాయని టీమ్‌మేనేజ్‌మెంట్ అతని అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. కనీసం సెమీస్‌కి కూడా అర్హత సాధించలేక పేలవ ఆటతీరుతో నిష్క్రమించింది.

Story first published: Wednesday, March 4, 2020, 16:24 [IST]
Other articles published on Mar 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X