న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రైనా.. అఫ్రిదిలా రిటైర్మెంట్ వెనక్కి తీసుకో: ఆకాష్ చోప్రా

Aakash Chopra Urges Suresh Raina to come out of retirement like Shahid Afridi

ముంబై : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిలా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కోరాడు. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన వయసు రైనాది కాదన్న ఈ మాజీ ఓపెనర్.. అతనికి టీ20 ప్రపంకప్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. ఇక భారత 74 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఆ వెంటనే మహీబాటలోనే తాను నడుస్తానని రైనా ఆటకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ఆటగాళ్ల ఆకస్మిక నిర్ణయంతో యావత్ భారతం షాక్‌కు గురవ్వగా.. చాలా మంది రైనా తొందరపడ్డాడని అభిప్రాయపడుతున్నారు.

రైనాకు అనవసరం..

రైనాకు అనవసరం..

ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన చోప్రా.. రైనా రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సురేశ్ రైనా ఇప్పటికే చాలా ఆడి ఉండొచ్చు. కానీ రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరమైతే అతనికి ఇప్పుడు లేదు. అతను వయసు 33 ఏళ్లు మాత్రమే. కొన్ని గాయాలతో సతమతమవుతున్నా.. అదేం పెద్ద సమస్య కాదు. ఏ ఆటగాడికి గాయల సమస్యల్లేవ్? అతను సర్జరీ కూడా చేయించుకున్నాడు.. ప్రస్తుతం ఫిట్‌గా, మెరుగ్గానే ఉన్నాడు. నా ఆలోచన ప్రకారం ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుతామా? అనే ఆతృతతో ఉన్నాడు.

 ధోనీ సమస్య వేరు..

ధోనీ సమస్య వేరు..

ఇక ధోనీ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కరోనా లేకుండా ఏప్రిల్-మేలో ఐపీఎల్ జరిగి, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్-నవంబర్‌లో టీ20 ప్రపంకప్ నిర్వహించి ఉంటే మహీ తప్పుకుండా భారత్ తరఫున బరిలోకి దిగేవాడు. కానీ కరోనా పుణ్యమా ఈ మెగాటోర్నీలు వాయిదాపడ్డాయి. బహుషా అతని రిటైర్మెంట్‌కు ఇదే కారణం కావచ్చు. కానీ రైనాకు ఇలాంటి సమస్యలు ఏమీ లేవు. నేనైతే షాహిద్ అఫ్రిదిలా రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకోమని చెబుతున్నా. వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లలో రాణిస్తే రైనాకు వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ భారత జట్టులో అవకాశం దక్కుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

 ఊహించలేదన్న మోదీ..

ఊహించలేదన్న మోదీ..

13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో కలిపి 768 పరుగులు... వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో కలిపి 5,615 పరుగులు... టీ20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో కలిపి 1,605 పరుగులు సాధించాడు. ఇక రైనా రిటైర్మెంట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రైనాను ఉద్దేశించి రాసిన సుదీర్ఘ లేఖలో ప్రశంసలు కురిపించిన మోదీ.. ఎంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ప్లేయర్‌గా కనిపించే రైనా ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతాడని ఊహించలేదని పేర్కొన్నాడు.

వివాదాస్పద అఫ్రిది..

వివాదాస్పద అఫ్రిది..

షాహిద్ అఫ్రిది తన కెరీర్ మొత్తం వివాదాలతోనే సావాసం చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఈ పాక్ మాజీ క్రికెటర్ 2011లో పీసీబీతో తలెత్తిన వివాదంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పీసీబీ.. సెంట్రల్‌ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు 4.5 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. పీసీబీ బోర్డును ప్రక్షాలన చేస్తే తాను మళ్లీ జట్టులోకి వస్తానని అ‍ప్పట్లో మీడియా ఎదుట వాపోయిన అఫ్రిది... పీసీబీ చైర్మన్‌గా ఇలియాజ్‌ భట్‌ పదవి చేపట్టిన తర్వాత తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు. అలా ఆఫ్రిది వీడ్కోలు పలుకుతూ యూటర్న్‌లు తీసుకున్నాడు.

నువ్వు హెచ్చరించి పదేళ్లు అయింది కోహ్లీ భాయ్.. నన్నేం చేయలేకపోయావ్.. !

Story first published: Friday, August 21, 2020, 15:53 [IST]
Other articles published on Aug 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X