నువ్వు హెచ్చరించి పదేళ్లు అయింది కోహ్లీ భాయ్.. నన్నేం చేయలేకపోయావ్.. !

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ ట్విటర్ యూజర్ ఎగతాళి చేశాడు. పదేళ్ల కిందటి విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక కెరీర్ ప్రారంభంలో ఉన్న కోహ్లీకి ప్రస్తుత కోహ్లీకి చాలా తేడా ఉన్న విషయం తెలిసిందే. ఆరంభంలో అత్యంత దూకుడుగా ఉన్న కోహ్లీ.. తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేకపోయేవాడు. ప్రత్యర్థులు కవ్విస్తే అదే స్థాయిలో బదులిచ్చేవాడు. బ్యాట్స్‌మన్ ఔటైనప్పుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ అసభ్యపదజాలాన్ని వాడేవాడు. బౌలర్లపై కూడా నోరు పారేసుకునేవాడు. ఇలా భావోద్వేగాలను అదుపులోకి పెట్టుకోలేక తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.
అసభ్య సంజ్ఞతో..
ఈ క్రమంలోనే 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలో అభిమానులవైపు తప్పుడు సంజ్ఞ చేసి తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్‌లోని ఇది ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా కూడా కోహ్లీ అదే దురుసుతనాన్ని ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్3 అనే ఓ ట్విటర్ యూజర్‌కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అకౌంట్‌ను డియాక్టివేట్ చేయిస్తానని బెదరించాడు.
ఐదేళ్లకోసారి..
‘ఇషాన్ 3.. మీ అకౌంట్‌పై రిపోర్ట్ చేశా. త్వరలోనే డీయాక్టివేట్ అవుతుంది. నీకు అసభ్యపదజాలం వాడాలనుంటే నాకు ట్వీట్ చేయవద్దు'అని అప్పట్లో విరాట్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే కోహ్లీ హెచ్చరించినట్లుగా ఆ అకౌంట్ డీయాక్టివ్ కాకపోవడంతో ఆ ట్విటర్ యూజర్ కోహ్లీకి ఐదేళ్లకోసారి గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నాడు. కోహ్లీ వార్నింగ్ ట్వీట్ తర్వాత 2016 ఏప్రిల్‌లో ‘ఐదేళ్లు పూర్తయింది కోహ్లీ.. ఇంకా ట్విటర్‌లోనే ఉన్న బ్రో'అని సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు.

పదేళ్లు అయింది..
తాజాగా గురువారం మరోసారి గుర్తు చేసిన ఇషాన్.. పదేళ్లు పూర్తయింది నన్నేం చేయలేకపోయావ్? అంటూ ఎగతాళి చేశాడు. ‘కోహ్లీ భాయ్.. ఇప్పటికీ నేను ట్విటర్‌లోనే ఉన్నా.. 10 ఏళ్లు అయింది బ్రో.. నన్నేం చేయలేకపోయావ్'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక కరోనా బ్రేక్‌తో ఇన్నాళ్లు ఇంట్లోనే ఉన్న కోహ్లీ ఐపీఎల్ 2020 సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. ఆర్సీబీ జట్టుతో ప్రత్యేక విమానంలో నేడు దుబాయ్‌కి బయల్దేరనున్నాడు.

ఒత్తిడి సహజమే..
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షే అయ్యింది. అయితే టైటిల్ లేని లోటు జట్టును వేధిస్తుందని సహజంగానే ఈ ఒత్తిడి తమ ఆటగాళ్లపై ఉంటుందని జట్టు చైర్మన్ సంజీవ్ చురివాలా అన్నారు. ఐపీఎల్‌లో ఆడే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు యూఏఈలో క్వారంటైన్ కావాల్సిన అవసరం లేదన్నారు.
ఇరు జట్ల ఆటగాళ్లు జీవ రక్షణ వలయంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లు ఆడతారని... బుడగలో ఉన్న క్రికెటర్లకు మళ్లీ క్వారంటైన్ అవసరం ఏముంటుందని సంజీవ్ వ్యాఖ్యానించారు.
దుబాయ్‌లో విజృంభిస్తున్న కరోనా.. గీత దాటొద్దని ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications