న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేలంలో మిచెల్ స్టార్క్‌‌ కోసం ఆర్‌సీబీ ఎంత ధరైనా చెల్లిస్తుంది: ఆకాశ్ చోప్రా

Aakash Chopra says RCB will run after Mitchell Starc if he is available
IPL 2021 Auction : RCB Will Run After Mitchell Starc, If He Is Available - Aakash Chopra

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌‌ లక్ష్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వ్యూహాలు రచిస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఫిబ్రవరి‌లో ఐపీఎల్ 2021 సీజన్ వేలం జరగనుండగా.. అత్యధికంగా 10 మంది క్రికెటర్లను వేలంలోకి వదిలేసిన కోహ్లీసేన .. రూ.35.7 కోట్లతో మినీ ఆక్షన్‌కు సిద్దమవుతోంది. తమ బౌలింగ్ బలాన్ని పెంచుకునేందుకు మిచెల్ స్టార్క్‌ కోసం అవసరమైతే రూ. 15 నుంచి 19 కోట్లు వెచ్చించేందుకు కూడా ఆర్‌సీబీ వెనుకాడబోదని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

 రూ.19 కోట్లు అయినా

రూ.19 కోట్లు అయినా

తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆర్‌సీబీ ఆక్షన్ ప్లాన్స్‌‌ను విశ్లేషించిన చోప్రా.. ఆసీస్ యువ క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ను కూడా తీసుకునే అవకాశం ఉందన్నాడు. 'ఆర్‌సీబీకి ఇప్పుడు మొత్తం 11 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో ముగ్గురు విదేశీ క్రికెటర్లను కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. అయితే.. ఆ టీమ్ తుది జట్టులో ఇప్పటికే ఏబీ డివిలియర్స్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్ రూపంలో నాలుగు ఓవర్‌సీస్ స్లాట్స్ భర్తీ అయ్యాయి. కనుక ఆర్‌సీబీ విదేశీ క్రికెటర్లను ఎక్కువ మందిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ మిచెల్ స్టార్క్ వేలంలో ఉంటే..? అతని కోసం ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ చివరి వరకూ పోరాడుతుంది. అవసరమైతే స్టార్క్ కోసం వేలంలో రూ.15-19 కోట్లు వెచ్చించేందుకు కూడా ఆ ఫ్రాంఛైజీ సిద్ధమవుతోంది'' అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.

కామెరూన్ గ్రీన్ కోసం..

కామెరూన్ గ్రీన్ కోసం..

ఇక మిడిలార్డర్ బలహీనతను అధిగమించేందుకు ఆ జట్టు ఆసీస్ యువ క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ను కూడా తీసుకునే అవకాశం ఉందని ఈ టీమిండియా మాజీ ఓపెనర్ తెలిపాడు. ఇప్పటికే ఆరోన్ ఫించ్‌ను వదులుకున్న ఆ జట్టు అతని స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్, జాసన్ రాయ్‌లలో ఒకరిని దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చన్నాడు.

'ఆర్‌సీబీ మిడిలార్డర్ బలహీనంగా ఉన్నందును ఆ సమస్యను అధిగమించేందుకు ఆ ఫ్రాంచైజీ కామెరూన్ గ్రీన్‌ను తీసుకునే ప్రయత్నం చేయవచ్చని నాకనిపిస్తుంది. అలాగే ఆరోన్ ఫించ్‌ను వదులుకోవడంతో ఓపెనర్ స్లాట్ కూడా ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసేందుకు డేవిడ్ మలన్, జాసన్ రాయ్‌లల్లో ఒకరిని తీసుకునే అవకాశం కూడా ఉంది'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

స్టార్క్‌కు రూ. 9.4 కోట్లు

స్టార్క్‌కు రూ. 9.4 కోట్లు

బెంగళూరు జట్టులో ఇప్పటికే నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, చాహల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్‌కు చెందిన బౌలర్లు ఉన్నారు. అయితే.. ఎడమచేతి వాటం సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఒకరు టీమ్‌లో ఉంటే బాగుంటుందని ఆర్‌సీబీ ఆశిస్తోంది. ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన మిచెల్ స్టార్క్‌ను అప్పట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.4 కోట్లకి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు ఐపీఎల్‌ సీజన్లకు మిచెల్ స్టార్క్ దూరంగా ఉన్నాడు. అయితే స్టార్క్ 2021 సీజన్ ఆడుతాడనే విషయంపై కూడా క్లారిటీ లేదు.

ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్

ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, షెబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే

వదులుకున్న ఆటగాళ్లు: మోయిన్ అలీ, శివమ్ దూబే, గుర్‌క్రీత్ సింగ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, పార్థీవ్ పటేల్(రిటైర్డ్), డేల్ స్టేయిన్, ఇసురు ఉడానా, ఉమేశ్ యాదవ్

ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!

Story first published: Wednesday, January 27, 2021, 11:39 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X