న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో కేన్ విలియమ్సన్ ప్లేస్‌కు మహ్మద్ నబీ ఎసరు: ఆకాశ్ చోప్రా

Aakash Chopra Says Mohammad Nabi’s form might put Kane Williamson’s place in danger at SRH

న్యూఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్‌ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ నబీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. సెయింట్ లూసియా జౌక్స్ జట్టు తరఫున ఆడుతున్న ఈ అఫ్గాన్ ప్లేయర్.. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లో అదరగొడుతూ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు. అయితే నబీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. మరో 18 రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన చోటును కోల్పోనున్నాడని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా తెలిపాడు.

నబీ అదరగొడుతున్నాడు..

నబీ అదరగొడుతున్నాడు..

సహచర కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌తో స్టార్ స్పోర్ట్స్ వేదికగా ‘నబీ పెర్ఫామెన్స్‌'పై చర్చించిన చోప్రా.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘సీపీఎల్‌లో మహ్మద్ నబీ అదరగొడుతున్నాడు. బ్యాట్, బంతితో మెరుస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తనదైన ఆటతో తన స్థాయిని పెంచుకున్నాడు. ఎవరైనా ఓవర్‌కు 4.5 నుంచి 4.75 పరుగులిస్తే అది టెస్ట్ బౌలింగ్‌గా పరిగణిస్తారు. అలా నబీ టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడు.'అని చోప్రా ప్రశంసించాడు.

 రషీద్ కన్నా నబీ బెస్ట్..

రషీద్ కన్నా నబీ బెస్ట్..

ఇక సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ కన్నా మహ్మద్ నబీ సీపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. బ్యాట్, బంతితో మెరుస్తూ మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫామెన్స్ ఇస్తున్నాడని తెలిపాడు. ‘ప్రస్తుతం రషీద్ ఖాన్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. కానీ నబీ అటు బ్యాట్, ఇటు బంతితో మెరుస్తున్నాడు. రషీద్ కన్నా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టోర్నీలో నబీ ఆట చూస్తుంటే.. రషీద్ కన్నా అతనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది'అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

విలియమ్సన్‌కు కష్టాలు తప్పవు..

విలియమ్సన్‌కు కష్టాలు తప్పవు..

ఇక నబీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఐపీఎల్ 2020 సీజన్‌లో కేన్ విలియమ్సన్‌కు కష్టాలు తప్పవని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో నబీ కారణంగా విలియమ్సన్ చోటు కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు. ఈ వ్యాఖ్యలతో మంజ్రేకర్ కూడా ఏకీభవించాడు. ఈ కారణంగా విలియమ్సన్ బాధపడ్డా.. సన్‌రైజర్స్‌‌ హైదరాబాద్ సంతోషిస్తుందన్నాడు. ‘నబీ ఇలానే బ్యాటింగ్‌లో రాణిస్తే.. కేన్ విలియమ్సన్ చోటుపై సందిగ్ధత నెలకొననుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ హైదారబాద్ జట్టుకు మాత్రం మేలు జరగనుంది'అని చెప్పిన చోప్రా.. ఈ చర్చను ముగించాడు.

 సీపీఎల్‌లో తొలి బౌలర్‌గా..

సీపీఎల్‌లో తొలి బౌలర్‌గా..

ఇక సీపీఎల్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన నబీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో(15, 13, 35 నాటౌట్, 27, 30 నాటౌట్, 2) 122 పరుగులు చేశాడు. ఇందులో రెండు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో(0/13, 1/19, 1/17, 1/17, 1/15, 5/15, 1/18) 10 వికెట్లు తీశాడు. ఇందులో పాట్రియోట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ (5/15) ఐదు వికెట్లతో చెలరేగి సీపీఎల్‌లో ఈ ఘనత అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇతరుల సక్సెస్‌ను ఆస్వాదించే రైనాకు విజయం తలకెక్కిందా..? శ్రీనివాసన్‌పై నెటిజన్ల ఫైర్

Story first published: Wednesday, September 2, 2020, 8:13 [IST]
Other articles published on Sep 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X