ఇతరుల సక్సెస్‌ను ఆస్వాదించే రైనాకు విజయం తలకెక్కిందా..? శ్రీనివాసన్‌పై నెటిజన్ల ఫైర్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తప్పుకోవడంపై ఆ జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రైనాకు విజయ గర్వం తలకెక్కిందని, తాను తప్పుకోవడం వల్ల తమ జట్టుకు వచ్చే నష్టమేం లేదని, కోట్ల రూపాయాలు చేజార్చుకొని అతనే పశ్చాత్తాపానికి గురవుతాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ యజమానిని ఏకిపారేస్తున్నారు. 10 ఏళ్లుగా చెన్నై జట్టు విజయానికి కృషి చేసిన రైనాకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని రైనాకు క్షమాపణలు చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
అదంతా ఫేక్..
ఇక కరోనా భయం, కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం, హోటల్ గది విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో విభేదాలు... రైనా నిష్క్రమణకు కారణాలని ప్రచారం జరిగింది. ఇది కూడా తప్పుడు ప్రచారమేనని, బంధువుల అకాల మరణంతోనే రైనా ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడని కామెంట్ చేస్తున్నారు. ఇతరుల సక్సెస్‌ను ఆస్వాదించే రైనా.. చిల్లరగా హోటల్ గది గురించి మనస్థాపానికి గురవుతాడా? దానికే తనకెంతో ఇష్టమైన ఐపీఎల్‌ను వీడుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఫేక్ న్యూస్‌కు స్వస్తి పలకాలని, వీటని నమ్మవద్దని కూడా ప్రజలకు సూచిస్తున్నారు. పలు మ్యాచ్‌ల్లో ఇతర ఆటగాళ్ల పట్ల రైనా ప్రవర్తించిన తీరును గుర్తు చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు.
రైనా.. చెన్నై నుంచి తప్పుకో..
ఇక రైనా పాతతరం హీరోల ఫీలవుతున్నాడరని శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడుతున్నారు. వెంటనే రైనా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకోవాలని, మరో మంచి జట్టు చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇంకొందరు ధోనీ తన స్వార్థం కోసం రైనాను బలి ఇచ్చాడని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. రైనా పట్ల శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు నిజమైతే.. అంతకన్నా అవమానం మరొకటి ఉండదని, జట్టుకు ఎంతో సేవ చేసిన రైనాకు శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. వెంటనే అతనికి మరో ఫ్లైట్ ఏర్పాటు చేసి జట్టులోకి తీసుకోవాలన్నాడు. శ్రీనివాసన్ తన కొడుకునే చిత్రహింసలకు గురిచేశాడని, అలాంటి వ్యక్తి క్రికెటర్లు ఎలా గౌరవమిస్తాడని ఇంకోకరు ట్వీట్ చేశారు.
నా మాటలను వక్రకరించారు..
ఇక సోషల్ మీడియా వేదికగా తనపై తీవ్ర విమర్శలు రావడంతో శ్రీనివాసన్ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. రైనాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, రైనాకు అండగా నిలుస్తామని చెప్పారు. 'ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు సురేష్ రైనా చేసిన సేవలు అసమానం. రైనా కంట్రిబ్యూషన్‌కు వెల కట్టలేం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. రైనా మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాల్సిన సమయమిది. మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంది. ఇప్పుడు కూడా మేం అతని వెంటే ఉంటాం. నేను రైనాను తప్పు పట్టలేదు' అని శ్రీనివాసన్ స్పష్టం చేశారు.
బంధువుల మరణంపై స్పందించిన రైనా..
భారత్‌కు చేరుకున్న రైనా మంగళవారం తన నిష్క్రమణపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముందుగా పంజాబ్‌లో తన మేనత్త కుటుంబంపై జరిగిన దాడిపై స్పందించాడు. ఇది చాలా దారుణమని, తన మామాను దుండగులు అతి కిరాతకంగా చంపారని రైనా ట్విటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను వదిలిపెట్టవద్దని పంజాబ్ పోలీసులను కోరాడు. ఈ ట్వీట్‌తో రైనా నిష్క్రమణపై జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదేనని స్పష్టమైంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తాజా కరోనా పరీక్షల్లో అందరికి నెగటీవ్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications