న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైని ఓడించే దమ్ము సన్‌రైజర్స్‌కే ఉంది.. ఫ్లే ఆఫ్స్ చేరే ఫస్ట్ టీమ్ కూడా అదే.. ఆకాశ్ చోప్రా జోస్యం!

Aakash Chopra feels Sunrisers Hyderabad could be the first team to qualify for IPL 2021 playoffs
IPL 2021 : Sunrisers Hyderabad Playoffs చేరే ఫస్ట్ టీమ్ | #MI ని చిత్తు చేసే దమ్ము SRH కే ఉంది

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ హంగామా మొదలైంది. శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ ధనాధన్ పండుగ షురూ కానుంది. ఇప్పటికే ఆయా జట్లన్నీ ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం సన్నదమవుతుండగా.. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, కామెంటేటర్లు వారి ప్రిడిక్షన్స్ మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా వారి అంచనాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ ప్లే ఆఫ్ చేరే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదేనని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా ఫైవ్ టైమ్ చాంపియన్, పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించే సత్తా కూడా హైదరాబాద్‌కే ఉందన్నాడు.

ఫస్ట్ టీమ్ హైదరాబాదే..

ఫస్ట్ టీమ్ హైదరాబాదే..

గత ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ నిలకడైన ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. గత సీజన్‌ ఆరంభంలో తడబడినా.. చివర్లో చెలరేగి మూడో స్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్‌లో ఆ జట్టు ఫస్టాఫ్ మ్యాచ్‌లను చెన్నై, ఢిల్లీ వేదికగా ఆడనుంది. అయితే ఈ రెండు వేదికలు ఆరెంజ్ ఆర్మీకి కలిసొస్తాయని ఆకాశ్ చోప్రా తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.

అంతేకాకుండా ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్‌లో లేదా సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుకు నిలుస్తుంది. వారి తొలి తొమ్మిది మ్యాచ్‌ల్లో 6 లేదా ఏడు గెలిచే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ ఫస్టాఫ్ మ్యాచ్‌ల వేదికలు వారికి కలిసి రానున్నాయి.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

2011 World Cup భారత్-పాక్ సెమీసే అసలు ఫైనల్‌.. ధోనీ సిక్స్‌తో ఊపిరి పీల్చుకున్నాం: సైమన్ టౌఫెల్

ముంబైని ఓడించే దమ్ము..

ముంబైని ఓడించే దమ్ము..

ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించే దమ్ము, సత్తా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 'ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు గట్టి సవాల్ విసిరే జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. ముంబైతో ఆడే నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా హైదరాబాద్ రెండు గెలుస్తుంది.'అని చోప్రా పేర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ముంబైని ఓడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లే పేపర్‌పై బలంగా కనిపిస్తున్నాయి.

టాప్ స్కోరర్ వార్నరే..

టాప్ స్కోరర్ వార్నరే..

సన్‌రైజర్స్ సారథి, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో కూడా రాణిస్తాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఈ ఆసీస్ స్టారే టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉందన్నాడు. 'సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నరే హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలుస్తాడు. కాకపోతే అతను మునపటిలా 150 స్ట్రైక్‌‌రేట్‌తో ఆడాలేడు. కొంచెం నిదానంగా ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ అతను గత సీజన్ల మాదిరే 500 నుంచి 550 పరుగులు చేయగలడు.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

పర్పుల్ క్యాప్ రషీద్‌దే..

పర్పుల్ క్యాప్ రషీద్‌దే..

ఇక సన్‌రైజర్స్ సెన్సేషన్ రషీద్ ఖాన్ ఈ సీజన్‌లోను అదరగొడుతాడని చోప్రా అంచనా వేసాడు. హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకుంటాడని అభిప్రాయపడ్డాడు. స్పిన్‌కు అనుకూలించే చెన్నై, ఢిల్లీ వేదికలపై అతను బంతితో చెలరేగుతాడన్నాడు. 'రషీద్ ఖాన్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడు. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా అందుకుంటాడు.

తొలి ఐదు మ్యాచ్‌లు చెన్నైలో, మిగతా నాలుగు మ్యాచ్‌లో ఢిల్లీలో జరగనున్నాయి. ఈ రెండు వేదికలు స్పిన్‌కు అనుకూలంతో దాంతో అతను సులువుగా ఈ 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయగలడు.'అని చోప్రా విశ్లేషించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడని, పవర్‌ప్లేలో సత్తా చాటుతాడని తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది.

SA vs PAK: ఐపీఎల్ కోసం వన్డే సిరీస్ ఓడిన సౌతాఫ్రికా.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు!

Story first published: Thursday, April 8, 2021, 13:09 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X