2011 World Cup భారత్-పాక్ సెమీసే అసలు ఫైనల్‌.. ధోనీ సిక్స్‌తో ఊపిరి పీల్చుకున్నాం: సైమన్ టౌఫెల్

దుబాయ్: టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన దినం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది మంది అభిమానుల కల నెరవేస్తూ.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని భారత క్రికెట్ టీమ్ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. క్రికెట్ ఆడే ప్రతీ జట్టు కల అయిన వన్డే వరల్డ్‌కప్‌ను రెండోసారి హస్తగతం చేసుకుంది. ఇండియన్ క్రికెట్ దశ, దిశను మార్చిన ఈ అద్భుత ఘట్టానికి ఇటీవలే పదేళ్లు పూర్తయింది. అయినా, ఆ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాయి. అప్పుడు సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేసిన సైమన్‌ టౌఫెల్‌.. తాజాగా నాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు.

అసలు ఫైనల్ మ్యాచ్ అదే..

అసలు ఫైనల్ మ్యాచ్ అదే..

ఆ మెగా టోర్నీలో మొహాలీ వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ సెమీసే అసలైన ఫైనల్ మ్యాచ్ అన్నాడు. ఆ రోజు ప్రపంచం మొత్తం తమనే చూస్తున్నట్లు అనిపించిందని, అలాగే యావత్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జెట్ ఫ్లైట్స్ ఉన్నాయేమోనని, అవన్నీ చండీగడ్ విమానాశ్రయంలో పార్క్ చేశారనిపించిందన్నాడు. ఇక ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్‌తో ఊపిరిపీల్చుకున్నామని చెప్పాడు. ఇటీవల ఐసీసీ మీడియా టీమ్‌తో మాట్లాడిన ఈ మాజీ అంపైర్‌.. ఆ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ప్రతి ఒక్కరికి జెట్ ఫ్లైట్..

ప్రతి ఒక్కరికి జెట్ ఫ్లైట్..

'మొహాలి వేదికగా భారత్‌-పాక్‌ తలపడిన సెమీఫైనల్స్ అద్భుతమైన మ్యాచ్‌. దాన్నే అసలు ఫైనల్‌ అని చెప్పొచ్చు. ఆరోజు ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం మమ్మల్నే చూస్తున్నట్లుగా అనిపించింది. అలాగే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జెట్‌ ప్లేన్స్‌ ఉన్నాయేమో.. అవన్నీ చంఢీగడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో పార్క్‌ చేశారేమో అనిపించింది. ఇక టైటిల్ ఫైట్ జరగాల్సిన ముంబైలో అప్పటికే సంబరాలు మిన్నంటయి. దాన్ని నేను రెండో ఫైనల్స్‌గా భావిస్తా' అని టౌఫెల్‌ పేర్కొన్నారు.

ధోనీ సిక్స్‌తో.. హమ్మయ్యా..

ధోనీ సిక్స్‌తో.. హమ్మయ్యా..

'ఇక ఫైనల్లో ధోనీ చివర్లో సిక్సర్‌ కొట్టడం నాకింకా గుర్తుంది. హమ్మయ్యా.. ఎలాగోలా బతికిపోయాం. ఈ టోర్నీ నుంచి క్షేమంగా బయటపడ్డాం. కొంత మంది ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, మరికొంత మంది ఓదార్చుకుంటున్నారు. ఇక అంపైర్లుగా ఉన్న మాకైతే పెద్ద భారం తొలగిపోయినట్లు అనిపించింది. మా తరఫు నుంచి ఎలాంటి ఫిర్యాదులు, లేదా తప్పిదాలు జరగలేదని అనిపించింది. అలా అంతా సజావుగా జరగడంతో రూమ్‌కెళ్లి ఊపిరిపీల్చుకున్నాం' అని టౌఫెల్‌ నాటి ఫైనల్‌ అనుభవాలను నెమరువేసుకున్నారు

చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో..

చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో..

ఇక సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్‌, ఆ తర్వాత ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. అనంతరం భారత్.. గౌతమ్ గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97) అద్భుత పోరాటానికి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో 48.2 ఓవర్లలోనే 4 వికెట్లకు 277 రన్స్ చేసి గెలుపొందింది. దాంతో యావత్‌ భారత దేశం సంబరాల్లో మునిగిపోయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 8, 2021, 11:27 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X