న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీడా పురస్కారాలు: 12 మంది కూడిన కమిటీలో సభ్యులుగా మేరీ కోమ్, భూటియా

Mary Kom, Bhaichung Bhutia in 12-member selection panel for national sports awards

హైదరాబాద్: ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కార విజేతలను ఎంపిక చేసేందుకు గాను కొత్త నిబంధనను పాటించింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా అథ్లెట్లు, కోచ్‌ల అవార్డులను 12 మంది సభ్యుల ప్యానెల్ ఎంపిక చేయనుంది.

ఈ ప్యానెల్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్, భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ భైచుంగ్ భూటియాలకు చోటు దక్కింది. ప్రతి ఏటా భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా పురస్కారాలను ప్రధానం చేస్తోన్న సంగతి తెలిసిందే.

నిషేధం ముగిసిందిగా? ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్?

మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకునే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ జాతీయ పురస్కారాలపై 12 మంది సభ్యులతో కూడిన ఓ సెలక్షన్ కమిటీని ఎంపిక చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ముకుందం శర్మ అధ్యక్షత వహిస్తారు.

ఈ కమిటీలో క్రీడా శాఖ సెక్రటరీ రాథే శ్యామ్ జులానియాతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) సీఈఓ కమాండర్ రాజేష్ రాజగోపాలన్, మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అంజుమ్ చోప్రా, మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, టేబుల్ టెన్నిస్ కోచ్ కమలేష్ మెహతాలు ఉన్నారు.

ఆర్చర్‌ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్‌ రెండో టెస్టులో చోటు?

వీరితో పాటు ఇద్దరు మీడియా వ్యక్తులు టైమ్స్ గ్రూప్ (డిజిటల్) చీఫ్ ఎడిటర్ రాజేష్ కల్రా, ప్రఖ్యాత స్పోర్ట్స్ వ్యాఖ్యాత చారు శర్మలకు కేంద్ర క్రీడాశాఖ చోటు కల్పించింది. ఈ కమిటీ గత ఎడిషన్ల మాదిరి కాకుండా జాతీయ క్రీడా పురస్కారాల విజేతలు - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు (కోచ్‌ల కోసం), ధ్యాన్ చంద్ అవార్డు (జీవితకాల సాధన), జాతీయ ఖేల్ ప్రోత్సాహాన్ అవార్డులను అందజేస్తుంది.

Story first published: Thursday, August 8, 2019, 18:47 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X