
హైదరాబాద్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్, బ్యాటింగ్‌లో విజృంభించాడు. ఆరు వికెట్లతో పాటు సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న సెకండ్ ఎలెవన్ చాంపియన్‌షిప్ సౌత్ గ్రూప్‌లో ససెక్స్ షైర్ తరఫున జోఫ్రా ఆర్చర్ ఆడుతున్నాడు. మంగళవారం గ్లౌసెష్టర్‌షైర్‌తో ప్రారంభమైన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్ ఫామ్ కొనసాగిస్తూ గ్లౌసెష్టర్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఆర్చర్ దెబ్బకు గ్లౌసెష్టర్ షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే ఆలౌట్ అయింది.
శ్రీలంక హెడ్ కోచ్‌పై వేటు.. రత్నాయకేకు తాత్కాలిక పగ్గాలు
ససెక్స్ షైర్ తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ బ్యాట్ లులిపించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్చర్.. 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు చేసాడు. గ్లౌసెష్టర్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆర్చర్ చెలరేగడంతో ససెక్స్ షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గ్లౌసెష్టర్ 199 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ ఒక వికెట్ తీసాడు.
'మాజీ క్రికెటర్ అక్తర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు'
ఈ అద్భుత ప్రదర్శనతో యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆర్చర్‌కు చోటు దాదాపు ఖాయం అయింది. యాషెస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఆర్చర్‌ను తీసుకున్నా.. తొలి టెస్టులో ఆడే అవకాశం రాలేదు. సీనియర్, టెస్ట్ స్పెషలిస్ట్ పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు ఉండటంతో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. గాయం కారణంగా అండర్సన్ రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో.. ఆర్చర్ ఆడే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో కూడా 20 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. మొదటి యాషెస్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆగష్టు 14 నుండి లార్డ్స్ మైదానంలో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.