నిషేధం ముగిసిందిగా? ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్?

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం అనంతరం ఏడాదిపాటు నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్ యాషెస్ టెస్టు సిరిస్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
గతేడాది కేప్ టౌన్ వేదికగా సఫారీలతో జరిగిన టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్ పాల్పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా వీరిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధం తర్వాత డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు తామెంటో మరోసారి నిరూపించుకున్నారు.
బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్ షెడ్యూల్ విడుదల
ఏడాది పాటు నిషేధం వీరిద్దరి ప్రవర్తనలో సైతం మార్పుని తెచ్చింది. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించే అవకాశం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ మాట్లాడారు. గతేడాది బాల్ టాంపరింగ్ ఉదంతం జరిగిన సమయంలో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో
తాజాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా ఛీఫ్ ఎర్ల్ ఎడ్డింగ్స్ మాట్లాడుతూ "ఇది మా రాడార్‌లో కూడా లేదు. ప్రస్తుతం ఉన్న కెప్టెన్ చాలా గొప్పగా తన పనిని చేస్తున్నాడు. స్టీవ్ ఇప్పుడిప్పుడే తిరిగి వచ్చాడు. స్మిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా నియమించాలనే ఆలోచన లేదు. బోర్డు మీటింగ్స్‌లో కూడా ఇదే చెప్పాను" అని అన్నాడు.

తిరిగి వచ్చినందుకు సంతోషిస్తున్నాం
"(స్మిత్, వార్నర్ మరియు బాన్‌క్రాఫ్ట్) తిరిగి వచ్చినందుకు మేమంతా సంతోషిస్తున్నాం. ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకురావడంపైనే దృష్టి సారించాం. ప్రస్తుతం వారు సరైన మార్గంలో ఆడుతున్నారు. కాబట్టి స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించడంపై దృష్టి సారించలేదు" అని ఆస్ట్రేలియా ఛీఫ్ ఎర్ల్ ఎడ్డింగ్స్ వివరించాడు.
ఆర్చర్ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్ రెండో టెస్టులో చోటు?

టిమ్ కెప్టెన్‌గా అద్భుతం
"నిషేధం ఎదుర్కొన్న ముగ్గురు ఆటగాళ్లు బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారు మళ్లీ జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. టిమ్ కెప్టెన్‌గా అద్భుతం. అతడిని మార్చాలని బోర్డు ఎజెండాలో లేదు" అని ఎడ్డింగ్స్ తెలిపాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టిమ్ పైన్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
మరో 11 పరుగులు చేస్తే: లారా రికార్డుకి ఎసరు పెట్టిన క్రిస్ గేల్

లార్డ్స్ వేదికగా ఆగస్టు 14 నుంచి రెండో టెస్టు
టెస్టుల్లో ప్రస్తుతం అతడె కెప్టెన్‌గా కొనసాగుతుండగా... ప్యాట్ కమ్మిన్స్, ట్రావిడ్ హెడ్‌లు వైస్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టిమ్ పైన్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ టెస్టు సిరిస్ జరుగుతుంది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక, రెండో టెస్టు ఆగస్టు 14న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications