థామస్, ఉబెర్‌ కప్‌ సారథులుగా శ్రీకాంత్, సింధు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) గురువారం ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన ఈ జట్లకు ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, వరల్డ్‌ మాజీ నెంబర్‌ వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ సారథ్యం వహించనున్నారు. థామస్‌ కప్‌లో.. 2016 చాంపియన్‌ డెన్మార్క్‌, జర్మనీ, అల్జీరియాతో కలిసి గ్రూప్‌ 'సి'లో భారత్‌ తలపడనుంది. ఇక..ఉబెర్‌ కప్‌లో చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌లతో గ్రూప్‌ 'డి'లో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.

చైనా డౌట్..

చైనా డౌట్..

అయితే 14 సార్లు విజేత చైనా టోర్నీలో పాల్గొనేదీ లేనిదీ ఇంకా ఖరారు చేయలేదు. సింధు, సైనా, శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, మహిళల డబుల్స్‌ జంట సిక్కి, అశ్వినీ రెండు సూపర్‌ 750 టోర్నీలు..డెన్మార్క్‌ ఓపెన్‌ (అక్టోబరు 13-18), డెన్మార్క్‌ మాస్టర్స్‌ (అక్టోబరు 20-25) ఆడనున్నారు. డెన్మార్క్‌లోని ఆర్హ్‌సలో వచ్చేనెల 3 నుంచి 11 వరకు జరిగే థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌కు జట్ల ఎంట్రీలను పంపేందుకు ఈనెల 18 ఆఖరు తేదీ.

ప్రాక్టీస్ క్యాంప్ రద్దు..

ప్రాక్టీస్ క్యాంప్ రద్దు..

థామస్‌, ఉబెర్‌ కప్‌ టోర్నీలకోసం ఈనెల 7 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో శిబిరాన్ని ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) భావించింది. కానీ ఏడు రోజుల స్వీయ నిర్బంధ నిబంధన నుంచి షట్లర్లకు మినహాయింపు ఇచ్చేందుకు ‘సాయ్‌' ససేమిరా అనడంతో శిబిరాన్ని రద్దు చేస్తూ ‘బాయ్‌' గురువారం నిర్ణయం తీసుకుంది.

థామస్‌, ఉబెర్‌ కప్‌కు భారత జట్లివే...

థామస్‌, ఉబెర్‌ కప్‌కు భారత జట్లివే...

థామస్‌ కప్‌ జట్టు

శ్రీకాంత్‌, పి.కశ్యప్‌, లక్ష్యసేన్‌, శుభాంకర్‌డే, సిరిల్‌ వర్మ, మను అత్రి, సుమిత్‌ రెడ్డి, ఎంఆర్‌ అర్జున్‌, ధ్రువ్‌ కపిల, కృష్ణప్రసాద్‌ గరగ

ఉబెర్‌ కప్‌

పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, ఆకర్షీ కశ్యప్‌, మాళ్‌విక బన్సోడ్‌, అశ్వినీ పొ న్నప్ప, సిక్కిరెడ్డి, పూజా దండు, సంజనా సంతోష్‌, పూర్విషా ఎస్‌.రామ్‌, జక్కంపూడి మేఘన

డెన్మార్క్‌ ఓపెన్‌, డెన్మార్క్‌ మాస్టర్స్‌ శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌, లక్ష్యసేన్‌, అ శ్వినీ పొన్నప్ప, పీవీ సింధు, సిక్కిరెడ్డి.

ఓయ్ స్మిత్ ఏందీ తొండాట.. ఆస్ట్రేలియా చీటింగ్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్ !

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 11, 2020, 8:35 [IST]
Other articles published on Sep 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X