న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కష్టమైనా.. సింధు అలవాటు చేసుకోవాలి : గోపి చంద్

National coach Pullela Gopichand Says PV Sindhu needs to adapt to crammed BWF calendar

కోల్‌కతా: వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్‌) నిర్దేశించిన షెడ్యూల్‌ కష్టంగానే ఉన్నప్పటికీ సింధు దానికి అలవాటు చేసుకోవాలి నేషనల్ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సూచించారు. వరల్డ్ చాంపియన్‌షిప్ విజయానంతరం సింధు ఆట గాడితప్పిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో తెలుగు అమ్మాయి సతమతమవుతోంది. అయినా సింధుకు టోక్యోలో పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇతర భారత టాప్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌ కూడా 'టోక్యో'కు అర్హత సాధిస్తారన్నారు. ప్రస్తుతం జూనియర్‌ స్థాయిలోనూ భారత ప్లేయర్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్న ఆయన భవిష్యత్‌లో భారత బ్యాడ్మింటన్‌ గొప్ప విజయాలు సాధిస్తుందని తెలిపారు. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన 'డ్రీమ్స్‌ ఆఫ్‌ ఎ బిలియన్‌' పుస్తకాన్ని ఈ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ వ్యూహాలు, బీడబ్ల్యూ ఎప్ షెడ్యూల్‌పై మాట్లాడారు.

రీఎంట్రీలో అదరగొట్టిన హైదరాబాద్ అల్లుడురీఎంట్రీలో అదరగొట్టిన హైదరాబాద్ అల్లుడు

కష్టమైనా తప్పదు...

కష్టమైనా తప్పదు...

‘బిజీ షెడ్యూల్‌ వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లు ఈ సమస్య ను ఎదుర్కొంటున్నారు. ఒక టాప్‌లెవెల్ షట్లర్‌గా ఈ షెడ్యూల్‌కు అలవాటు పడటం సింధు బాధ్యత. ఈ పరిస్థితికి ఆమె అలవాటు పడాలి.

ఒలింపిక్స్ మెడల్ ఖాయం..

ఒలింపిక్స్ మెడల్ ఖాయం..

ఒలింపిక్స్‌ ముందు సింధు తన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో ఉంది. త్వరలోనే మా బలహీనతలపు అధిగమిస్తాం. కోచ్‌ తు సంగ్‌ పార్క్, ట్రెయినర్‌ శ్రీకాంత్‌లతో కూడిన మా టీమ్‌ దానిపైనే పని చేస్తోంది. సింధు కచ్చితంగా ‘టోక్యో'లో పతకం సాధిస్తుంది. మంచి ప్రిపరేషన్‌తో సింధు బరిలోకి దిగుతుంది. ఒలింపిక్స్‌కు ముందు ఇంకా ఏడు టోర్నీలున్నాయి. సైనా, శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌ అర్హతకు సరిహద్దుల్లో ఉన్నారు. రాబోయే టోర్నీల్లో వారు రాణించాలి.

యువ భారత్‌ హ్యాట్రిక్‌... న్యూజిలాండ్ చిత్తు

తర్వాతి తరాల కోసం..

తర్వాతి తరాల కోసం..

బ్యాడ్మింటన్‌లో రాణించాలంటే ఒక పక్కా ప్రణాళికతో కూడిన సిస్టమ్ కావాలి. నేను తరుచూ చెబుతుంది అదే. ఇక్కడికి వచ్చిన విదేశీ కోచ్‌లు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఆటగాళ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. తర్వాతి తరాల కోసం ఇప్పటి వరకు మనం పెద్దగా పెట్టుబడి పెట్టింది లేదు. కానీ యువ క్రీడాకారులు అంతర్జాతీయ ప్లేయర్లుగా ఎదగాలంటే వారికి మంచి అవకాశాలు, సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం జూనియర్‌ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు మెరుగ్గా రాణిస్తున్నారు. 15-19 వయో విభాగంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వీరంతా భవిష్యత్‌లో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారనడంలో సందేహం లేదు.

Story first published: Saturday, January 25, 2020, 10:08 [IST]
Other articles published on Jan 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X