న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువ భారత్‌ హ్యాట్రిక్‌... న్యూజిలాండ్ చిత్తు

U-19 World Cup: India Beat New Zealand To Set Up Quarter-Final Clash With Australia

బ్లూమ్‌ఫోంటీన్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు కొనసాగుతుంది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ 'ఎ' చివరి లీగ్‌ మ్యాచ్‌లో యువ భారత్‌ 44 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన)తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయంతో లీగ్‌ దశను సంపూర్ణ విజయాలతో ముగించింది. ఈనెల28న క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.

ఎంత పనిచేస్తివి రాహులా?.. పంత్‌పై పేలుతున్న జోకులు, ఫన్నీ మీమ్స్.!!ఎంత పనిచేస్తివి రాహులా?.. పంత్‌పై పేలుతున్న జోకులు, ఫన్నీ మీమ్స్.!!

యశస్వీ జైస్వాల్‌ (57 నాటౌట్‌), దివ్యాన్ష్‌ సక్సేనా (52 నాటౌట్‌) అజేయ హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ వికెట్ నష్టపోకుండా 23 ఓవర్లలో 115 రన్స్ చేసింది. ఈ సమయంలోవర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం న్యూజిలాండ్‌ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 192 పరుగులుగా నిర్ధారించారు.

అయితే భారత బౌలర్లలో రవి బిష్టోయ్(4/30), అథర్వ అంకోలేకర్(3/28) దెబ్బకు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు 21 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. రిస్ మరియు(42),ఫెర్గస్ లెల్‌మన్(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న రవి బిష్ణోయ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Story first published: Saturday, January 25, 2020, 23:03 [IST]
Other articles published on Jan 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X