న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో ఆ అమెరికాకు నేను వెళ్లను.. యూఎస్ ఓపెన్ ఆడను: ఆష్లే బార్టీ

World No.1 Ashleigh Barty pulls out of US Open amid concern over Covid-19

మెల్‌బోర్న్: కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రపంచ మహిళల టెన్నిస్‌ నెంబర్‌వన్‌, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఆష్లే బార్టీ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లడం అంత సురక్షితం కాదని తెలిపింది. ఫ్రెంచ్ ఓపెన్‌పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని పేర్కొంది.

'అమెరికాకు వెళ్లొద్దని నేను నా టీమ్ డిసైడ్ అయ్యాం. దీంతో ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్, వెస్టర్న్ అండ్ సౌథర్న్ ఓపెన్‌ బరిలో దిగాలనుకోవడం లేదు. తర్వలోనే ఫ్రెంచ్ ఓపెన్, డబ్ల్యూటీఏ యూరోపియన్ టోర్నమెంట్స్‌పై కూడా తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాను'అని బార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని క్విన్స్‌లాండ్‌లో ఉన్న బార్టీ.. గత కొన్ని నెలలుగా కరోనా తీవ్రతను నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాలో దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో టోర్నీలో పాల్గొనకపోవడమే ఉత్తమమని భావించింది. నాలుగు రోజుల క్రితం యూఎస్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనడం అనేది ఆసీస్‌ ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని టెన్నిస్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్రెగ్‌ టిలీ ప్రకటించడంతో బార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

ఇక న్యూయార్క్ వేదికగా ఆగస్టు 31 నుంచి యూఎస్ ఓపెన్ జరుగాల్సి ఉంది. కాగా అక్క కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టోర్నీపై సందిగ్ధత ఏర్పడగా.. కచ్చితంగా జరుపుతామని ఇటీవల నిర్వాహకులు ప్రకటించారు. అయితే ప్రపంచ నెంబర్ వన్ అయిన అష్లే బార్టీనే టోర్నీలో పాల్గొనలేనని చెప్పడంతో యూఎస్ ఓపెన్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇక పురుషుల నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్, యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాధల్ కూడా ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనడం అనుమానాస్పదంగా మారింది. కాకపోతే ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే సౌథర్న్ అండ్ వెస్టర్న్ ఓపెన్ కోసం అమెరికా టెన్నీస్ అధికారులు ఏర్పాటు చేసిన బయో సెక్యూరిటీ హబ్‌లోకి ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎంటరయ్యారు. ఇక మహిళల ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోన హలెప్, 2018 విజేత నవోమి ఒసాకా, డిఫెండింగ్ చాంపియన్ బియాంక అండ్రీస్కూ‌లు మాత్రం ఇంకా పాల్గొనలేదు. ఇక అమెరికాలో బుధవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య లక్షా యాబైవేలకు చేరింది.

అందరికంటే ముందుగానే దుబాయ్‌కి సీఎస్‌కే.. మిడ్ ఆగస్టులో ట్రైనింగ్ షురూ!అందరికంటే ముందుగానే దుబాయ్‌కి సీఎస్‌కే.. మిడ్ ఆగస్టులో ట్రైనింగ్ షురూ!

Story first published: Thursday, July 30, 2020, 10:33 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X