న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2022: చెమటలు పట్టించిన అమెరికా కుర్రాడు.. గట్టెక్కిన నాదల్!

Wimbledon 2022: Rafael Nadal makes it to semi-final

లండన్‌: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన నాదల్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండో సీడ్‌ నాదల్ సెమీస్‌లో అతికష్టంపై విజయం సాధించాడు. అమెరికా కుర్రాడు 11వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ నాదల్‌కు చెమటలు పట్టించాడు. బుధవారం అయిదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో నాదల్‌ 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (10-4)తో టేలర్‌ ఫ్రిట్జ్‌పై విజయం సాధించాడు.

పొత్తి కడుపులో నొప్పితో..

పొత్తి కడుపులో నొప్పితో..

పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బందిపడ్డా.. మ్యాచ్‌లో నాదల్‌ గొప్పగా పోరాడాడు. ఫ్రిట్జ్‌ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. ఆటగాళ్లు మ్యాచ్‌లో అనేకసార్లు బ్రేకులు సాధించి ఆద్యంతం అలరించారు. ముఖ్యంగా నాదల్‌ ముచ్చటైన డ్రాప్‌ షాట్లతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించిన తీరు ఆకట్టుకుంది. దాదాపు నాలుగు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నాదల్‌ అయిదు ఏస్‌లు, 56 విన్నర్లు కొట్టాడు. నాదల్‌ సెమీఫైనల్లో కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా)ను ఢీకొంటాడు. అయితే ఈ పోరులో నాదల్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

సెమీస్‌లోకి కిర్గియోస్..

సెమీస్‌లోకి కిర్గియోస్..

మరో క్వార్టర్‌ఫైనల్లో కిర్గియోస్‌ 6-4, 6-3, 7-6 (7-5)తో గారిన్‌ (చిలీ)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో కిర్గియోస్‌ 17 ఏస్‌లు, 35 విన్నర్లు కొట్టాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ (సెర్బియా) ఫైనల్లో చోటు కోసం 9వ సీడ్‌ నోరీ (బ్రిటన్‌)ను ఢీకొంటాడు.

ఫైనల్ చేరిన హలెప్..

ఫైనల్ చేరిన హలెప్..

మాజీ ఛాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 6-2, 6-4తో అమెరికాకు చెందిన అమందా అనిసిమోవాపై విజయం సాధించింది. హలెప్‌ సెమీస్‌లో రిబకినా (కజకిస్థాన్‌)తో తలపడుతుంది. మరో క్వార్టర్స్‌లో రిబకినా 4-6, 6-2, 6-3తో టామ్‌జనోవిచ్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్లో సెమీఫైనల్‌ చేరిన మొదటి కజకిస్థాన్‌ ప్లేయర్‌గా రిబకినా ఘనత సాధించింది. మరోవైపు ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీఫైనల్‌ చేరిన తొలి అరబ్‌ మహిళగా ఆన్స్‌ జాబెర్‌ (ట్యునీసియా) చరిత్ర సృష్టించింది. వింబుల్డన్‌ క్వార్టర్‌ఫైనల్లో ఆమె.. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బౌజ్కోవాను ఓడించింది.

Story first published: Thursday, July 7, 2022, 9:40 [IST]
Other articles published on Jul 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X