న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2022: ఫైనల్లో ఇగా స్వియాటెక్ X అన్స్ జబర్

US Open 2022: Ons Jabeur, Iga Swiatek Enter Womens Singles Final

న్యూయార్క్‌: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీలో కొత్త మహిళల సింగిల్స్ విజేతను చూడొచ్చు. ప్రపంచ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌), ఐదో సీడ్‌ అన్స్‌ జబర్‌ (ట్యునీషియా) తొలిసారిగా యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. వింబుల్డన్‌లో చేజారిన గ్రాండ్‌స్లామ్‌ స్వప్నాన్ని యూఎస్‌ ఓపెన్‌లోనైనా సాధించాలన్న పట్టుదలతో ఉన్న మహిళల ఐదోసీడ్‌ ఓన్స్‌ జెబ్యూర్‌ తన లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి సూపర్‌ఫామ్‌తో అలరిస్తున్న ఈ ఆఫ్రికన్‌ సంచలనం.. అదే జోరులో ఫైనల్లో అడుగుపెట్టింది.

తొలి ఆఫ్రికా మహిళగా..

తొలి ఆఫ్రికా మహిళగా..

గురువారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో జెబ్యూర్‌ 6-1, 6-3తో ఫ్రాన్స్‌కు చెందిన 17వ సీడ్‌ కరోలిన్‌ గార్సియాను చిత్తుచేసింది. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా చెలరేగిన జెబ్యూర్‌ వరుససెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ గెలుపుతో గార్సియా వరుస 13 మ్యాచ్‌ల విజయానికి జెబ్యూర్‌ బ్రేక్‌ వేసింది. తొలిసెట్‌లో ఒకే ఒక గేమ్‌ నెగ్గిన గార్సియా.. జెబ్యూర్‌ సంధించిన బలమైన షాట్లకు ఏ దశలోనూ బదులివ్వలేకపోయింది. ఏకంగా 8 ఏస్‌లతో విరుచుకుపడిన జెబ్యూర్‌ 21 విన్నర్లను సంధించింది. గార్సియా 2 ఏస్‌లు, 12 విన్నర్లతో సరిపెట్టుకుంది. జెబ్యూర్‌ రెండుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేసినా.. తనకు లభించిన 4 బ్రేక్‌ పాయింట్లను సద్వినియోగం చేసుకొంది. ఈ విజయంతో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన తొలి ఆఫ్రికా మహిళగా 28 ఏళ్ల జెబ్యూర్‌ చరిత్ర సృష్టించింది.

స్వియటెక్ జోరు..

స్వియటెక్ జోరు..

మరో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ స్వియటెక్‌ 3-6, 6-1, 6-4తో ఆరోసీడ్‌ సబలెంక (బెలార్‌స)ను ఓడించింది. 2 గంటలా 11 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో స్వియటెక్‌ తొలిసెట్‌ కోల్పోయినా అద్భుతంగా పుంజుకొని తర్వాతి సెట్లలో పైచేయి సాధించింది. 2 ఏస్‌లు సంధించిన స్వియాటెక్‌ 3 డబుల్‌ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్‌లు కొట్టి ఏడుసార్లు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది.

తొలి పొలాండ్ ప్లేయర్‌గా

తొలి పొలాండ్ ప్లేయర్‌గా

ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2020, 2022)తో రెండు మేజర్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న 21 ఏళ్ల స్వియటెక్‌.. తాజా విజయంతో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన తొలి పోలెండ్‌ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకు ఈ ఆఖరి పోరు ఆరంభమవుతుంది.

Story first published: Saturday, September 10, 2022, 10:05 [IST]
Other articles published on Sep 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X